Telugu Global
Others

జగన్‌ కోమాలోకి వెళ్లే ప్రమాదం?

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ నిరాహారదీక్ష చేస్తున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని వార్తలు వెలువడ్డాయి. దీక్ష ఆరో రోజుకు చేరింది. ఆరురోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో పూర్తిగా నీరసించిపోయారు. మరోవైపు కీటోన్స్‌ 3 ప్లస్‌కు చేరుకోవడంతో కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. కీటోన్స్‌ స్థాయి ప్రమాద స్థాయికి చేరిందని, ఇది మరింత పెరిగితే కోమాలోకి వెళ్లిపోతారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్‌కు వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు […]

జగన్‌ కోమాలోకి వెళ్లే ప్రమాదం?
X
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రకటించాలని కోరుతూ నిరాహారదీక్ష చేస్తున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని వార్తలు వెలువడ్డాయి. దీక్ష ఆరో రోజుకు చేరింది. ఆరురోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో పూర్తిగా నీరసించిపోయారు. మరోవైపు కీటోన్స్‌ 3 ప్లస్‌కు చేరుకోవడంతో కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. కీటోన్స్‌ స్థాయి ప్రమాద స్థాయికి చేరిందని, ఇది మరింత పెరిగితే కోమాలోకి వెళ్లిపోతారని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జగన్‌కు వైద్యపరీక్షలు నిర్వహించిన వైద్యులు దీక్ష విరమించాలని సూచించారు. శరీరంలో డీహైడ్రేషన్ మొదలైందని, ఆయన దీక్ష విరమిస్తే మంచిదని సూచించారు. కీటోన్స్ కారణంగా కిడ్నీలపై ప్రభావం ఉంటుందని తెలిపారు. జగన్ తక్షణం దీక్ష విరమించి, ఆహారం తీసుకోవాలని సూచించారు. ఆరు రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యం క్షీణించడంతో వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రత్యేక హోదాపై ప్రకటన చేస్తేనే తాను దీక్ష విరమిస్తానని జగన్‌ చెబుతున్నారు.
First Published:  12 Oct 2015 2:08 AM GMT
Next Story