Telugu Global
NEWS

మీడియామే సవాల్ అంటున్న జగన్

ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తున్న జగన్ ఆరోగ్యంపై ఆదివారం సాయంత్రం దుమారం చేలరేగింది. జగన్‌ షుగర్ లెవల్స్‌పై మంత్రి కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావు అనుమానం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది. ఉదయం పరీక్షల్లో ఒకలా… మధ్నాహ్నం పరీక్షల్లో మరోలా షుగర్ లెవల్స్‌ ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని అనుమానం వ్యక్తం చేశారు. మంత్రి వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం తాను దీక్ష చేస్తుంటే వైద్యరంగాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వం నీచ […]

మీడియామే సవాల్ అంటున్న జగన్
X

ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తున్న జగన్ ఆరోగ్యంపై ఆదివారం సాయంత్రం దుమారం చేలరేగింది. జగన్‌ షుగర్ లెవల్స్‌పై మంత్రి కామినేని శ్రీనివాస్, ప్రత్తిపాటి పుల్లారావు అనుమానం వ్యక్తం చేయడంతో వివాదం మొదలైంది. ఉదయం పరీక్షల్లో ఒకలా… మధ్నాహ్నం పరీక్షల్లో మరోలా షుగర్ లెవల్స్‌ ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని అనుమానం వ్యక్తం చేశారు.

మంత్రి వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం తాను దీక్ష చేస్తుంటే వైద్యరంగాన్ని అడ్డుపెట్టుకుని ప్రభుత్వం నీచ రాజకీయాలకు దిగుతోందని మండిపడ్డారు. వైద్యులు వాడుతున్న గ్లూకో మీటర్లు ఒక్కోటి ఒక్కోలా రీడింగ్ చూపుతున్నాయని ఆరోపించారు.

మీడియా ముందే శాంపిల్స్ ఇవ్వడానికి తాను సిద్ధమని సవాల్ చేశారు. అందరి సమక్షంలోనే పరీక్షలు నిర్వహించాలని కోరారు. రాష్ట్రం కోసం తాను దీక్ష చేస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు.

మరోవైపు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని వ్యాఖ్యల నేపథ్యంలో బొత్ససత్యనారాయణ నేతృత్వంలో వైసీపీ బృందం గుంటూరు ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌ను కలిసింది. పరీక్షలు చేసింది జీజీహెచ్‌ వైద్యులే కాబట్టి అసలు నిజం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. జగన్‌ ఆరోగ్యంపై నివేదికలకు ఎందుకు బహిర్గతం చేయడం లేదని ప్రశ్నించారు.

షుగర్ లెవల్స్‌పై మంత్రి అనుమానం వ్యక్తం చేసినా ఎందుకు వివరణ ఇవ్వడం లేదని నిలదీశారు. అయితే సూపరింటెండెంట్ ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. జగన్ దగ్గర సేకరించిన బ్లడ్ శాంపిల్స్‌ను ఆస్పత్రికి తీసుకొచ్చే క్రమంలో సిబ్బంది ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నారని చెప్పారు. అందువల్లే ఆలస్యం జరిగి రక్త పరీక్షల్లో తేడా వస్తున్నాయని చెప్పారు.

First Published:  11 Oct 2015 4:37 PM GMT
Next Story