Telugu Global
Others

ఫేస్ బుక్ లో జగన్ టాప్

ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షకు మద్దతు వెల్లువెత్తుతోంది. ఆయన దీక్ష చేపట్టి ఆరు రోజులు కావడంతో ఆరోగ్య పరిస్థితి క్షీణించిందన్న వార్తలు మీడియాలో ప్రసారం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు జగన్ గురించి విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితితోపాటు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.  అందులో భాగంగానే ఫేస్ బుక్ ట్రెండింగ్ లిస్ట్ లోని పొలిటికల్ విభాగంలో జగన్ కు […]

ఫేస్ బుక్ లో జగన్ టాప్
X
ప్రముఖ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ఫేస్ బుక్ లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్షకు మద్దతు వెల్లువెత్తుతోంది. ఆయన దీక్ష చేపట్టి ఆరు రోజులు కావడంతో ఆరోగ్య పరిస్థితి క్షీణించిందన్న వార్తలు మీడియాలో ప్రసారం కావడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు జగన్ గురించి విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితితోపాటు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
అందులో భాగంగానే ఫేస్ బుక్ ట్రెండింగ్ లిస్ట్ లోని పొలిటికల్ విభాగంలో జగన్ కు ఆరో స్థానం లభించింది. మొదటి స్థానంలో శివసేన పార్టీ నిలించింది. ప్రముఖ రచయిత సుదీంద్ర కులకర్ణిపై నల్లరంగు పోసిన ఘటనపై ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది. దీంతో నెటిజన్లంతా శివసేన పార్టీ గురించి తెగ సెర్చ్ చేయడంతో ఫేస్ బుక్ ట్రెండ్స్ లో మొదటి స్థానం దక్కింది. ఇక రెండో స్థానంలో నెల్సన్ మండేలా, మూడో స్థానంలో మనోహర్ పారికర్ ఉన్నారు.
ఇటీవల దాద్రి ఘటనను నిరసిస్తూ తమ అవార్డులను తిరిగి ఇస్తున్నట్టు ప్రకటించిన సాహిత్య అకాడమి సభ్యులు ప్రకటించడంతో నాలుగో స్థానంలో నిలిచింది. ఇక ఏడాది క్రితం విశాఖను అతలాకుతలం చేసిన హుద్ హుద్ తుఫాన్ గురించి కూడా నెటిజన్లు చర్చించుకుంటున్నారు. దీంతో అది ఐదో స్థానంలో నిలిచింది. ఆరో స్థానంలో వైఎస్ జగన్ నిలిచారు.
First Published:  12 Oct 2015 11:26 AM GMT
Next Story