Telugu Global
CRIME

పోలీసులకు చిక్కిన 89 మంది 'ఎర్ర' కూలీలు

ఎర్రచందనం స్మగ్లర్లు అటవీ సంపదను కొల్లగొట్టడానికి రకరకాల మార్గాలు ఎన్నుకుంటున్నారు. తమిళనాడు నుంచి కూలీలను నేరుగా ఆంధ్రప్రదేశ్‌లోకి దించితే దొరికిపోతున్నారనే భావనతో ఇపుడు వాళ్ళ రూటును మార్చారు. ముందుగా కర్ణాటకకు పంపి అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఆంధ్రకు రప్పిస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన అటవీశాఖ అధికారులు నిఘా పెట్టడంతో శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికేందుకు కర్ణాటక ఆర్టీసీ బస్సులో వస్తున్న 89 మంది కూలీలు దొరికిపోయారు. కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో చిత్తూరు, కడపజిల్లాల మీదుగా […]

ఎర్రచందనం స్మగ్లర్లు అటవీ సంపదను కొల్లగొట్టడానికి రకరకాల మార్గాలు ఎన్నుకుంటున్నారు. తమిళనాడు నుంచి కూలీలను నేరుగా ఆంధ్రప్రదేశ్‌లోకి దించితే దొరికిపోతున్నారనే భావనతో ఇపుడు వాళ్ళ రూటును మార్చారు. ముందుగా కర్ణాటకకు పంపి అక్కడి నుంచి ఆర్టీసీ బస్సుల్లో ఆంధ్రకు రప్పిస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన అటవీశాఖ అధికారులు నిఘా పెట్టడంతో శేషాచలం అడవుల్లో ఎర్రచందనం చెట్లను నరికేందుకు కర్ణాటక ఆర్టీసీ బస్సులో వస్తున్న 89 మంది కూలీలు దొరికిపోయారు. కర్ణాటక ఆర్టీసీ బస్సుల్లో చిత్తూరు, కడపజిల్లాల మీదుగా అడవుల్లోకి చేరడానికి వీరు ప్లాన్‌ చేసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కూలీలతోపాటు కర్ణాటకకు చెందిన ఆర్టీసీ బస్సును భాకరాపేట అటవీశాఖ కార్యాలయానికి తీసుకొచ్చారు. వీరి నుంచి గొడ్డళ్లు, రంపాలు, కొడవళ్లు స్వాధీనం చేసుకున్నారు. డీఎఫ్‌వో పవన్‌కుమార్‌ మాట్లాడుతూ.. కూలీలను విచారించి వారి వెనకున్న మేస్త్రీలను, అసలు ప్రధాన సూత్రధారులను త్వరలో పట్టుకుంటామన్నారు.
ఎర్రచందనం స్మగ్లర్ అల్తాఫ్ హుస్సేన్ అరెస్ట్
పేరుమోసిన ఎర్రచందనం స్మగ్లర్ అల్తాఫ్ హుస్సేన్‌ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. జిల్లాలోని మదనపల్లెకు చెందిన అల్తాఫ్ హుస్సేన్ ఎర్రచందనం బడా స్మగ్లర్లయిన శేఖర్, షరీఫ్‌లకు అనుచరుడు. ఈయనను అరెస్టు చేసిననంతరం కర్ణాటక రాష్ట్రం దొడ్డబళ్లాపూర్‌లో ఫాంహౌస్‌లో దాచిన రూ.కోటి విలువైన 3 టన్నుల ఎర్రచందనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఈయన ఎక్కడెక్కడ ఎర్రచందనాన్ని దాచిపెట్టారన్న వివరాలను పోలీసులు రాబడుతున్నారు.

First Published:  11 Oct 2015 3:32 PM GMT
Next Story