పోలీసుల ఇళ్ళలోనే దొంగలు పడ్డారు!

దొంగల్ని పట్టాల్సిన పోలీసులు ఇంట్లోనే దొంగలు పడ్డారు. చోరీలు జరిగిన నాలుగిళ్ళలో మూడు కానిస్టేబుళ్ళవే. రంగారెడ్డి జిల్లా పరిగిలో దోపిడీ దొంగలు రెచ్చిపోయి ఈ దొంగతనాలు చేశారు. వీరు దొంగతనానికి పాల్పడుతున్నవి కానిస్టేబుళ్ల ఇళ్ళని వారికి తెలుసో లేదో కాని ఇపుడు వారిని పట్టుకునే ప్రయత్నం పోలీసులంతా కలిసి ప్రయత్నం చేస్తున్నారు. దొరికితే చింతకాయ పచ్చడి చేశాయాలని చూస్తున్నారట. పరిగిలో ఇటీవల కాలంలో వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. దీంతో స్థానికులంతా భయబ్రాంతులకు గురవుతూ పోలీసులను ఆశ్రయించారు. కేసుల పరిష్కారం విషయంలో పెద్దగా ప్రగతి చూపని పోలీసులకు ఇపుడు నేరుగా సవాలు స్వీకరించాల్సిన పరిస్థితి ఏర్పడడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని దొంగల్ని పట్టే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారని తెలుస్తోంది.