తప్పంతా గుణశేఖర్ దే

రుద్రమదేవి సినిమాకు రామ్ చరణ్ కు సంబంధం లేదు. కానీ రుద్రమదేవి హిట్ టాక్ కు చరణ్ కు మాత్రం సంబంధం ఉంది.  రుద్రమదేవి సినిమా హిట్టవ్వడంతో రామ్ చరణ్ కొద్దిగా ఇబ్బంది పడుతున్నాడు. ఎందుకంటే.. లాస్ట్ వీకెండ్ రుద్రమదేవి విడుదలైతే.. జస్ట్ వారం గ్యాప్ లో ఈ వీకెండ్ బ్రూస్ లీ విడుదలవుతోంది. రెండు పెద్ద సినిమాలు ఇంత షార్ట్ గ్యాప్ లో విడుదలైతే ఎవరికైనా ఇబ్బందే. అయితే ఇక్కడే తప్పంతా గుణశేఖర్ పై నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు చెర్రీ. బ్రూస్ లీ విడుదలకు సంబంధించి మొదట్నుంచి తాము ఒకటే రిలీజ్ డేట్ కు ఫిక్స్ అయి ఉన్నామని చెప్పుకొచ్చాడు చరణ్. కానీ గుణశేఖర్ మాత్రం మధ్యలో దూరి, తమకంటే వారం ముందు రుద్రమదేవిని విడుదల చేశాడని ఆరోపిస్తున్నాడు. సో.. తప్పంతా గుణదే అంటున్నాడు రామ్ చరణ్. అసలే.. మెగాకాంపౌండ్ కు గుణశేఖర్ కు మధ్య సంబంధాలు అంతంతమాత్రంగా ఉన్న ఈ నేపథ్యంలో.. చెర్రీ వ్యాఖ్యలు మరింత వివాదానికి మరింత ఆజ్యం పోశాయి. రామ్ చరణ్ వ్యాఖ్యలపై గుణ ఎలా స్పందిస్తాడో చూడాలి.