టాయ్‌లెట్‌లో 22 యాపిల్‌ ఐ-ఫోన్‌లు లభ్యం

ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఓ టాయ్లెట్లో దాచిన 22 యాపిల్‌ కంపెనీకి చెందిన ఐఫోన్లు బయటపడ్డాయి. టాయ్‌లెట్లు క్లీన్‌ చేస్తున్న సమయంలో వీటిని గుర్తించిన ఉద్యోగులు కేంద్ర పారిశ్రామిక భద్రత దళం సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా వారు వాటిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. దుబాయ్ నుంచి వచ్చిన పంజాబ్కు చెందిన ఓ ప్రయాణికుడి పాత్రపై అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు కూడా ఢిల్లీ ఎయిర్పోర్ట్లోనే 182 ఐఫోన్ 6 ఎస్, 6 ఎస్ ప్లస్ మొబైల్స్ను అక్రమంగా తరలిస్తున్న ఏడుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఇది జరిగి వారం రోజులు కూడా కాకముందే మళ్ళీ 22 ఐఫోన్‌లు దొరికాయి. కాగా యాపిల్‌ కొత్త మోడల్ ఐఫోన్ 6 ఎస్, 6 ఎస్ ప్లస్ను వచ్చే శుక్రవారం భారత్ మార్కెట్లోకి విడుదల చేయనున్న సమయంలో ఇవి దొరకడం ప్రాధాన్యత సంతరించుకుంది.