పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు

విజయనగరం జిల్లా సాలూరు మండలం రణసింగి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. కూబింగ్‌ జరుపుతున్న వేళ పోలీసులపై ఏడుగురు మావోయిస్టులు కాల్పులు జరిపారు. అయితే వాటిని పోలీసులు కూడా ధీటుగా ఎదుర్కోన్నట్టు తెలిసింది. అయితే నక్సల్స్‌ తప్పించుకుపోయినట్టు చెబుతున్నారు. కొన్ని ఆయుధాలు, కిట్‌ బ్యాగులు వదిలి పారిపోయినట్టు తెలుస్తోంది. అయితే… ప్రశాంతంగా ఉండే విజయనగరంలో అటవీ ప్రాంతంలో మావోయిస్టులు కాల్పులకు తెగబడటం నిఘా వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసినట్లు తెలిసింది. ఈ ప్రాంతంలో నక్సల్స్‌ కదలికలు ఎప్పుడూ గమనించలేదని, కాని అకస్మాత్తుగా ఒక్కసారి మావోలు తారసపడడంతో తేరుకునే లోపే పారిపోయారని పోలీసులు చెబుతున్నారు.