హరికథ చెప్తానంటున్న రామ్..

ఒకేసారి రెండు సినిమాల్ని శరవేగంగా సిద్ధంచేశాడు హీరో రామ్. అందులోంచి ఓ సినిమాను శివమ్ రూపంలో వదిలాడు. కానీ టైటిల్ లో ఉన్నంత పవర్ సినిమాలో లేకపోవడంతో శివం సినిమా తేలిపోయింది. మూవీ మూణ్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. దీంతో బాగా డల్ అయిపోయిన ఈ ఎనర్జిటిక్ హీరో, ఇప్పుడు హరికథ షురూ చేస్తున్నాడు. శివం సినిమాను కంప్లీట్ గా పక్కనపెట్టేసిన రామ్ ఇప్పుడు హరికథ ప్రమోషన్ ను భుజానికెత్తుకున్నాడు. ఇన్నాళ్లూ తనను మాస్ మసాలా సినిమాల్లో చూసిన ప్రేక్షకులు, హరికథలో తనను చూసి కచ్చితంగా థ్రిల్ ఫీలవుతారని అంటున్నాడు. గతంలో శివమ్ సినిమా విషయంలో కూడా ఇలానే ఊరించాడు రామ్. సినిమా కచ్చితంగా కొత్తగా ఉంటుందని ఊదరగొట్టాడు. తీరా థియేటర్లలోకి వచ్చాక అది ప్రేక్షకులకు నచ్చలేదు. దీంతో ఇప్పుడు హరికథ గురించి రామ్ చెబుతున్న విషయాల్ని జనాలు కేవలం ఓ హరికథలానే వింటున్నారు తప్ప, బుర్రకెక్కించుకోవట్లేదు. ఈ విషయం రామ్ కు అర్థం కావట్లేదు.