Telugu Global
CRIME

అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ఫయాజ్ అరెస్ట్

మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ఫయాజ్ షరీఫ్ అలియాస్ ఫయాజ్ అలియాస్ ఫయో (40)ను కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనిపై చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లాల్లో 61 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇన్నాళ్లూ పోలీసుల కళ్లుగప్పి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేస్తున్న ఇతనిని పులివెందుల సమీపంలో అరెస్ట్ చేసి రూ.రెండు కోట్ల విలువైన నాలుగు టన్నుల బరువుగల 178 ఎర్రచందనం దుంగలు, ఐదు కార్లు, మూడు వ్యాన్లు కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీకి చెందిన […]

మోస్ట్ వాంటెడ్ అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ ఫయాజ్ షరీఫ్ అలియాస్ ఫయాజ్ అలియాస్ ఫయో (40)ను కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతనిపై చిత్తూరు, వైఎస్‌ఆర్ జిల్లాల్లో 61 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇన్నాళ్లూ పోలీసుల కళ్లుగప్పి యథేచ్ఛగా స్మగ్లింగ్ చేస్తున్న ఇతనిని పులివెందుల సమీపంలో అరెస్ట్ చేసి రూ.రెండు కోట్ల విలువైన నాలుగు టన్నుల బరువుగల 178 ఎర్రచందనం దుంగలు, ఐదు కార్లు, మూడు వ్యాన్లు కొంత నగదు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీకి చెందిన అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ బద్రుల్ హసన్ అలియాస్ హసన్ భాయ్‌కి ఫయాజ్ ప్రధాన అనుచరుడని జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్ గులాటీ చెప్పారు. బెంగళూరు రూరల్ జిల్లా హోస్‌కోట తాలూకా కనగెనహళ్లికి చెందిన ఫయాజ్‌కి చైనా, దుబాయ్, సింగపూర్ తదితర ఆసియా దేశాల్లోని స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయని, పండ్లు, కూరగాయల మాటున కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ముంబయికి ఎర్రచందనం దుంగలను తరలించేవాడని ఆయన తెలిపారు. ఇతనికి బెంగళూరులో నాలుగు అపార్ట్‌మెంట్లు, కనగెనహళ్లిలో 10 ఇళ్లు, 15 ఎకరాల భూమి ఉందని, రూ.20 కోట్లకు పైగా ఆస్తులున్నాయని గులాటీ తెలిపారు.

First Published:  12 Oct 2015 4:02 PM GMT
Next Story