లండన్‌లో ‘మోడి ఎక్స్‌ప్రెస్‌’ బస్‌

బ్రిటన్‌లో వచ్చేనెల పర్యటించనున్న మోడికి ఘన స్వాగతం పలికేందుకు… ఇది చరిత్రలో ఎప్పటికీ గుర్తుండి పోయేలా చేసేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మోడికి ఘన స్వాగతం పలికేందుకు అక్కడి ఎన్‌ఆర్‌ఐలు మోడి ఎక్స్‌ప్రెస్‌ పేరిట ప్రత్యేకంగా రూపొందించిన ఓ బస్‌ను లండన్‌లో నెల రోజులపాటు నడపనున్నారు. యూకే వెల్‌కమ్స్‌ మోడి పేరిట ఓ కమిటీ ఏర్పాటై ఈ బస్సును రూపొందించింది. లిటిల్‌ ఇండియాగా పిలిచే వాంబ్లేలో బస్సు బయలుదేరింది. మోడి పర్యటన చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేలా ఉండాలని కోరుకుంటున్నామని, వచ్చేనెల 13న వాంబ్లే స్టేడియంలో మోడికి ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని కమిటీ ప్రతినిధి మయూరి పార్మర్‌ వ్యాఖ్యానించారు.