Telugu Global
Others

నాగం భేటీ అందుకేనా?

బీజేపీ నేత నాగం జ‌నార్ద‌న్‌రెడ్డి పార్టీ మారనున్నారంటూ కొంత‌కాలంగా వ‌స్తున్న వార్త‌ల‌న్నీ ఉత్త‌వేన‌ట‌. దాదాపు నెల‌రోజుల మౌనం త‌రువాత‌ తాను పార్టీ మార‌డం లేద‌ని నాగం జ‌నార్ద‌న్‌రెడ్డి స్వ‌యంగా ప్ర‌క‌టించారు. సోమ‌వారం ఆయ‌న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను క‌లిశారు. రాష్ట్రంలో రైతు ఆత్మ‌హ‌త్యలు, రాజ‌కీయ ప‌రిస్థితులను రాజ్‌నాథ్‌కు వివ‌రించాన‌ని నాగం విలేక‌రుల‌కు చెప్పారు. తాను పార్టీ మారేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే, నాగం బ‌య‌టికి చెప్పిన‌దానికంటే లోప‌ల వేరే జ‌రిగింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు బ‌హిరంగంగానే […]

నాగం భేటీ అందుకేనా?
X
బీజేపీ నేత నాగం జ‌నార్ద‌న్‌రెడ్డి పార్టీ మారనున్నారంటూ కొంత‌కాలంగా వ‌స్తున్న వార్త‌ల‌న్నీ ఉత్త‌వేన‌ట‌. దాదాపు నెల‌రోజుల మౌనం త‌రువాత‌ తాను పార్టీ మార‌డం లేద‌ని నాగం జ‌నార్ద‌న్‌రెడ్డి స్వ‌యంగా ప్ర‌క‌టించారు. సోమ‌వారం ఆయ‌న కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను క‌లిశారు. రాష్ట్రంలో రైతు ఆత్మ‌హ‌త్యలు, రాజ‌కీయ ప‌రిస్థితులను రాజ్‌నాథ్‌కు వివ‌రించాన‌ని నాగం విలేక‌రుల‌కు చెప్పారు. తాను పార్టీ మారేది లేద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే, నాగం బ‌య‌టికి చెప్పిన‌దానికంటే లోప‌ల వేరే జ‌రిగింద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు బ‌హిరంగంగానే అనుకుంటున్నారు. త్వ‌ర‌లోనే కిష‌న్‌రెడ్డి ప‌ద‌వీ కాలం ముగియ‌డం ఈ నేప‌థ్యంలో రాజ్‌నాథ్ సింగ్‌తో నాగం భేటీ కావ‌డం చ‌ర్చ‌లు జోరందుకున్నాయి.
రాజ్‌నాథ్ వివ‌ర‌ణ కోరారా?
నాగం పార్టీని వీడ‌నున్నార‌న్న వార్త‌ల‌పై నాగంను వివ‌ర‌ణ కోరిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. టీడీపీ రెండుక‌ళ్ల సిద్దాంతంతో విసిగిపోయిన నాగం టీడీపీని వీడి తెలంగాణ న‌గారా పేరుతో సొంత‌కుంప‌టి పెట్టుకున్నారు. దాన్ని ఎంతోకాలం న‌డ‌ప‌లేక చేతులెత్తేశారు. కాంగ్రెస్‌, టీడీపీల పేరు చెబితే.. తెలంగాణ ప్ర‌జ‌లు ఒంటికాలిమీద లేస్తున్నారు. టీఆర్ ఎస్‌లో చేర‌డానికి మ‌న‌సొప్ప‌లేదు. దీంతో రాజ్‌నాథ్ సింగ్ స‌మ‌క్షంలో బీజేపీలో చేరారు. ఆయ‌నకు బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చినా గెల‌వ‌లేదు. త‌రువాత క‌నీసం నామినేటెడ్ ప‌ద‌వీ ద‌క్క‌లేదు. మ‌రోవైపు రాష్ట్ర అధ్య‌క్షుడు కిష‌న్‌రెడ్డి వ‌ర్గం నాగంకు స‌రైన ప్రాధాన్యం ఇవ్వ‌డం లేద‌ని ఆయ‌న చిన్న‌బుచ్చుకున్నారు. దీంతో పార్టీ అనుమ‌తి లేకుండానే.. తెలంగాణ బ‌చావో పేరిట కొత్త కుంప‌టి ఏర్పాటు చేశారు. పార్టీని వీడుతారంటూ ప్ర‌చారం జ‌రిగినా..దానిపై నాగం ఎలాంటి ప్ర‌క‌ట‌న చేయ‌లేదు. దాదాపు నెల‌రోజుల స‌మ‌యం త‌రువాత రాజ్‌నాథ్‌ను క‌లిశాక నోరు విప్పారు. తాను పార్టీ మార‌డం లేద‌ని స్ప‌ష్టం చేశారు.
హామీ ద‌క్కిందా?
రాష్ట్ర రాజ‌కీయాల్లో దాదాపు 30 ఏళ్ల అనుభ‌వం క‌లిగిన నాగం సేవ‌లను బీజేపీ పూర్తిస్థాయిలో వినియోగించుకోలేదు. అందుకే నాగంను పార్టీలోకి ర‌మ్మ‌ని టీడీపీ ఆహ్వానిస్తోంద‌ని వార్త‌లు వినిపించాయి. పైగా తెలంగాణ రాష్ట్ర విభాగంలో కిష‌న్‌రెడ్డి వ‌ర్గంతో మిగిలిన ఏ వ‌ర్గానికి పొస‌గ‌డం లేదు. దీంతో నాగంను పిలిచి రాజ్‌నాథ్ బుజ్జ‌గించిన‌ట్లు స‌మాచారం. త్వ‌ర‌లో పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వి నుంచి కిష‌న్‌రెడ్డి త‌ప్పుకోనున్నారు. ఈనేప‌థ్యంలో రాజ్‌నాథ్ సింగ్‌తో నాగం భేటీ ప్రాధాన్యం సంత‌రించుకుంది.
First Published:  12 Oct 2015 9:48 PM GMT
Next Story