Telugu Global
Others

కలెక్షన్‌ క్వీన్‌ కవిత-టీటీడీపీ అధ్యక్షుడి ఆరోపణ

కలెక్షన్ కింగ్‌ బిరుదాంకితుడు మోహన్‌బాబు. మరీ కలెక్షన్ క్వీన్‌ ఎవరనుకుంటున్నారా? తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్‌ రమణ ఆరోపణల ప్రకారం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవితేనట. నిన్నమొన్నటి వరకూ బతుకమ్మ పేరుతో..జాగృతి సంస్థను అడ్డంపెట్టుకుని వసూళ్లకు పాల్పడిన కవిత..ఇప్పుడు రూటు మార్చిందని టీటీడీపీ అధ్యక్షుడు ఆరోపించారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం సహాయం ఏం చేస్తుందని అసెంబ్లీలో నిలదీస్తే..సమాధానం చెప్పకుండా విపక్ష సభ్యులను సస్పెండ్‌ చేసిన కేసీఆర్‌.. రైతులను ఆదుకునే బాధ్యత కూతురికి […]

కలెక్షన్‌ క్వీన్‌ కవిత-టీటీడీపీ అధ్యక్షుడి ఆరోపణ
X

కలెక్షన్ కింగ్‌ బిరుదాంకితుడు మోహన్‌బాబు. మరీ కలెక్షన్ క్వీన్‌ ఎవరనుకుంటున్నారా? తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎల్‌ రమణ ఆరోపణల ప్రకారం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె కల్వకుంట్ల కవితేనట. నిన్నమొన్నటి వరకూ బతుకమ్మ పేరుతో..జాగృతి సంస్థను అడ్డంపెట్టుకుని వసూళ్లకు పాల్పడిన కవిత..ఇప్పుడు రూటు మార్చిందని టీటీడీపీ అధ్యక్షుడు ఆరోపించారు. ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలకు ప్రభుత్వం సహాయం ఏం చేస్తుందని అసెంబ్లీలో నిలదీస్తే..సమాధానం చెప్పకుండా విపక్ష సభ్యులను సస్పెండ్‌ చేసిన కేసీఆర్‌.. రైతులను ఆదుకునే బాధ్యత కూతురికి ఎందుకు అప్పగించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతులను ఆదుకునే నెపంతో నెలకు ఒక్కో కుటుంబానికి 2500 చొప్పున నాలుగేళ్ల ఇస్తానని చెపుతున్న కవిత.. ఆ నెపంతో ఎన్ని కోట్లు వసూలు చేశారో చెప్పాలని రమణ డిమాండ్‌ చేశారు.

First Published:  13 Oct 2015 3:33 AM GMT
Next Story