Telugu Global
Others

హోదా కోసం జగన్‌తో కలిసి పని చేస్తాం: దిగ్విజయ్‌

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పని చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ తెలుగురాష్ట్రాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. జగన్మోహనరెడ్డితో తమకు విభేదాలున్న మాట నిజమే అయినప్పటికీ ఒక రాష్ట్ర అవసరాలకు వాటిని పక్కకు పెట్టడంలో తప్పులేదని, రాజకీయ విభేదాలు రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించేవిగా ఉండకూడదన్నది తన అభిప్రాయమని ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. జగన్‌ దీక్ష చేపట్టి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకు రాగలిగారని […]

హోదా కోసం జగన్‌తో కలిసి పని చేస్తాం: దిగ్విజయ్‌
X

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పని చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ తెలుగురాష్ట్రాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌సింగ్‌ తెలిపారు. జగన్మోహనరెడ్డితో తమకు విభేదాలున్న మాట నిజమే అయినప్పటికీ ఒక రాష్ట్ర అవసరాలకు వాటిని పక్కకు పెట్టడంలో తప్పులేదని, రాజకీయ విభేదాలు రాష్ట్ర ప్రయోజనాలకు భంగం కలిగించేవిగా ఉండకూడదన్నది తన అభిప్రాయమని ఆయన ఢిల్లీలో మీడియా సమావేశంలో చెప్పుకొచ్చారు. జగన్‌ దీక్ష చేపట్టి రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకు రాగలిగారని ఆయన అన్నారు. అయితే ఇలాంటి సున్నితమైన విషయాల్లో ప్రాణాలను పణంగా పెట్టాలనుకోవడం సరికాదని దిగ్విజయ్‌ చెప్పారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అన్ని పార్టీలు కలిసి పని చేయాలని సూచించారు. తెలంగాణలో రైతుల కోసం పోరాటం చేస్తున్నట్టే, ఏపీలో ప్రత్యేక హోదా కోసం అందరూ కలిసి ఉద్యమం చేయాలని ఆయన కోరారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి కాంగ్రెస్‌కు ప్రాతినిధ్యం లేకపోయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో పోరాడి తీరుతామని, ప్రత్యేక హోదా కోసం తాము భారతీయ జనతాపార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన తెలిపారు. నిజానికి కేంద్రం ఆర్థిక పరిస్థితి కూడా బాగోలేదని, ఖజానాలో డబ్బులు లేకుండా బీహార్‌ వంటి రాష్ట్రాలకు ప్యాకేజీలు ఎలా ప్రకటిస్తారని ఆయన ప్రశ్నించారు. అమలు చేయలేని హామీలు ఇవ్వడంలో చంద్రబాబునాయుడు కూడా ఏ మాత్రం తీసిపోడని దిగ్విజయ్‌ ఎద్దేవా చేశారు. తెలంగాణలో కుటుంబ పాలన కోనసాగుతోందని, రాష్ట్రం ఇచ్చిన తర్వాత దాన్ని ప్రచారం చేసుకోవడంలోను, అధికారం దక్కించుకోవడంలోను కాంగ్రెస్‌ పార్టీ విఫలమైందని, దీనివల్ల తమకు లాభమే ఎక్కువని అన్నారు. ఎందుకంటే ఈ ఐదేళ్ళలో కేసీఆర్‌ కుటుంబ పాలనపై జనానికి మోజు తీరుతుందని, ప్రజలను ఆయన ఎలా మోసం చేయగలరో అర్ధం చేసుకుంటారని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికలకు పార్టీని ఇప్పటి నుంచే సమాయత్తం చేస్తామని ఆయన చెప్పారు.

First Published:  13 Oct 2015 7:08 AM GMT
Next Story