Telugu Global
Cinema & Entertainment

అఖిల్ కోసం విశాఖ నుంచి ప్రచారం..

ఓవైపు రుద్రమదేవి సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోంది.. మరోవైపు బ్రూస్ లీ సినిమా ప్రచారంతో హోరెత్తిస్తోంది. ఈ రెండు సినిమాల తర్వాత రావాల్సిన అఖిల్ సినిమా మాత్రం స్తబ్దుగా మారిపోయింది. ఈ సినిమా ప్రమోషన్ ఇంకా షురూ కాలేదేంటని అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ పక్కా ప్లానింగ్ తో ప్రచారం షురూ చేయాలని భావిస్తోంది అక్కినేని టీం. అందుకే, అఖిల్ తొలి సినిమాకు విశాఖను వేదికగా ఎంచుకున్నారు. బ్రూస్ లీ సినిమా ఇలా విడుదలైన వెంటనే.. […]

అఖిల్ కోసం విశాఖ నుంచి ప్రచారం..
X
ఓవైపు రుద్రమదేవి సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతోంది.. మరోవైపు బ్రూస్ లీ సినిమా ప్రచారంతో హోరెత్తిస్తోంది. ఈ రెండు సినిమాల తర్వాత రావాల్సిన అఖిల్ సినిమా మాత్రం స్తబ్దుగా మారిపోయింది. ఈ సినిమా ప్రమోషన్ ఇంకా షురూ కాలేదేంటని అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్నారు. కానీ పక్కా ప్లానింగ్ తో ప్రచారం షురూ చేయాలని భావిస్తోంది అక్కినేని టీం. అందుకే, అఖిల్ తొలి సినిమాకు విశాఖను వేదికగా ఎంచుకున్నారు. బ్రూస్ లీ సినిమా ఇలా విడుదలైన వెంటనే.. అఖిల్ సినిమా ప్రమోషన్ ను హోరెత్తించాలని డిసైడ్ అయింది. అఖిల్ తో పాటు నాగార్జున, నాగచైతన్య, అమల సైతం రంగంలోకి దిగి ప్రమోషన్ ను ఊదరగొట్టాలని ఫిక్స్ అయ్యారు. దీనికి సంబంధించి ఇప్పటికే ప్లాన్స్ కూడా రెడీ అయ్యాయి. అఖిల్ సినిమా ప్రమోషన్ విశాఖ నుంచి షురూ కానుంది. విశాఖలో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ ను సెలబ్రేట్ చేసి అఖిల్ సినిమా ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించాలనుకుంటోంది టీం. ఇక అక్కడ్నుంచి దాదాపు ప్రతి ముఖ్యమైన ప్రాంతాన్ని కవర్ చేసేలా ప్రమోషన్ స్కెచ్ ను సిద్ధంచేశారు.
First Published:  13 Oct 2015 7:06 PM GMT
Next Story