Telugu Global
Cinema & Entertainment

ఫ్లాప్ సినిమాకి సల్మాన్ ఆమెను ఒప్పించాడా?

ఒక సినిమా ఫ్లాప్ అయితే దానికి కారణం ఏమిటి అనే కన్‌స్ట్రక్‌టివ్ ఫీడ్‌బ్యాక్ బదులు… బ్లేం గేం మొదలవ్వడం గ్లామర్ ఇండస్ట్రీలో సర్వసాధారణం. ఇప్పుడదే జరుగుతోంది బాలివుడ్ టాప్ హీరోయిన్ కంగన రనౌత్ ‘కట్టి బట్టి’ సినిమా ఫ్లాప్ విషయంలో. కథ మన నేటివిటీకి ఆనలేదు. ఇండియన్ ఆడియెన్స్‌కు మరీ ఫాస్ట్ ఫార్వర్డ్ లివ్-ఇన్ రిలేషన్‌షిప్ కాన్సెప్ట్ ఎక్కలేదు. పైగా కంగనా సినిమా అని ప్రచారం చేసి, ఆమె పాత్రకు అంతంత మాత్రంగానే స్క్రీన్ ప్రెజెన్స్ ఉండడం […]

ఫ్లాప్ సినిమాకి సల్మాన్ ఆమెను ఒప్పించాడా?
X

ఒక సినిమా ఫ్లాప్ అయితే దానికి కారణం ఏమిటి అనే కన్‌స్ట్రక్‌టివ్ ఫీడ్‌బ్యాక్ బదులు… బ్లేం గేం మొదలవ్వడం గ్లామర్ ఇండస్ట్రీలో సర్వసాధారణం. ఇప్పుడదే జరుగుతోంది బాలివుడ్ టాప్ హీరోయిన్ కంగన రనౌత్ ‘కట్టి బట్టి’ సినిమా ఫ్లాప్ విషయంలో. కథ మన నేటివిటీకి ఆనలేదు. ఇండియన్ ఆడియెన్స్‌కు మరీ ఫాస్ట్ ఫార్వర్డ్ లివ్-ఇన్ రిలేషన్‌షిప్ కాన్సెప్ట్ ఎక్కలేదు. పైగా కంగనా సినిమా అని ప్రచారం చేసి, ఆమె పాత్రకు అంతంత మాత్రంగానే స్క్రీన్ ప్రెజెన్స్ ఉండడం కూడా కారణం అయ్యింది.
ఇదంతా వదిలేసి గాసిప్ రాయుళ్ళు సల్మాన్ ఖాన్ మీద పడ్డారు. ఈ సినిమా మొదట్లో కంగనా రిజెక్ట్ చేసిందని అయితే ఒకసారి స్క్రిప్ట్ వినమని సల్మాన్ ప్రపోజ్ చేయడం వలన…విని ఓకే చేసిందట. సల్మాన్ తన మిత్రుడు, దర్శకుడైన నిఖిల్ కోసం కంగనాతో కధ వినమని చెప్పడం వలనే కంగనా ఒప్పుకుందని గాసిప్ రాయుళ్ళ అంటున్నారు. అయితే సినిమా ఒప్పుకోవడానికి సల్మాన్ కారణం కాదని కంగనా స్వయంగా పలు ఇంటర్‌వ్యూలలో చెప్పినా .. గాసిప్స్ రాయుళ్ళు మాత్రం కంగనా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ పై పీకలోతు కోపంతో ఉందనే ప్రచారం మొదలెట్టారు. ‘ఇదిగో తోక అంటే… అదిగో పులి’ అనే లోకం మరి!

First Published:  13 Oct 2015 7:03 PM GMT
Next Story