Telugu Global
Others

లాడెన్‌కు మేమే ఆశ్రయం కల్పించాం!

పాకిస్థాన్ ఉగ్రబుద్ది మరోసారి తేటతెల్లమైంది. ఉగ్రవాదులను పాకిస్థాన్ పెంచిపోషిస్తున్న మాట వాస్తవమేనని పాకిస్తాన్ రక్షణ శాఖ మాజీ మంత్రి అహ్మద్ ముక్తార్ బయటపెట్టారు. అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్‌లో ఉన్న సంగ‌తి అప్ప‌ట్లో త‌మ‌కు ముందే తెలుస‌ని ఒక టీవీ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఒప్పుకున్నారు. త‌మ దేశ‌మే లాడెన్‌కు ఆశ్ర‌యం క‌ల్పించింద‌ని చెప్పి బాంబు పేల్చారు. ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా ప‌నిచేసిన వ్య‌క్తి ఇలా నేరుగా లాడెన్ ఆశ్ర‌యంపై ప్ర‌క‌ట‌న చేయ‌డంతో పాకిస్తాన్ […]

లాడెన్‌కు మేమే ఆశ్రయం కల్పించాం!
X

పాకిస్థాన్ ఉగ్రబుద్ది మరోసారి తేటతెల్లమైంది. ఉగ్రవాదులను పాకిస్థాన్ పెంచిపోషిస్తున్న మాట వాస్తవమేనని పాకిస్తాన్ రక్షణ శాఖ మాజీ మంత్రి అహ్మద్ ముక్తార్ బయటపెట్టారు. అల్‌ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ పాకిస్తాన్‌లో ఉన్న సంగ‌తి అప్ప‌ట్లో త‌మ‌కు ముందే తెలుస‌ని ఒక టీవీ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఒప్పుకున్నారు. త‌మ దేశ‌మే లాడెన్‌కు ఆశ్ర‌యం క‌ల్పించింద‌ని చెప్పి బాంబు పేల్చారు.

ర‌క్ష‌ణ శాఖ మంత్రిగా ప‌నిచేసిన వ్య‌క్తి ఇలా నేరుగా లాడెన్ ఆశ్ర‌యంపై ప్ర‌క‌ట‌న చేయ‌డంతో పాకిస్తాన్ ప్ర‌భుత్వం ఉలిక్కిప‌డింది. ముక్తార్‌పై పాక్ నేత‌లు ఎదురుదాడి మొద‌లుపెట్టారు. లాడెన్‌కు ప్ర‌భుత్వ‌మే ఆశ్ర‌యం క‌ల్పించింద‌ని బ‌య‌ట‌ప‌డితే పెద్ద‌న్న అమెరికా ఎక్క‌డ క‌న్నేర్ర చేస్తుందోన‌ని కంగారు ప‌డుతున్నారు. ముక్తార్ చెప్పిన విష‌యాలు ప‌చ్చి అబ్ద‌ద్ద‌మ‌ని పాక్ మాజీ అధ్య‌క్షుడు ప‌ర్వేజ్ ముష‌ర‌ఫ్ ఖండించారు.

అమెరికా ద‌ళాలు లాడెన్ ఇంటిపై దాడి చేసి హ‌త‌మార్చే వ‌ర‌కు లాడెన్ త‌మ దేశంలో ఉన్న సంగ‌తే త‌మ‌కు తెలియ‌ద‌ని ఆ దేశ ర‌క్ష‌ణ శాఖ బుకాయిస్తోంది. పాకిస్తాన్ అబోటాబాద్లోని లాడెన్ నివాసంపై అమెరికా దళాలు అప్ప‌ట్లో దాడి చేసి హ‌త‌మార్చాయి. శ‌వాన్నిభూమి మీద క‌న‌నం చేస్తే ఆ స్థ‌లం కొంద‌రికి ద‌ర్శ‌నీయ‌ప్ర‌దేశం అవుతుంద‌న్న ఉద్దేశంతో అమెరికా ద‌ళాలు లాడెన్ శ‌వాన్ని సుముద్రంలో ప‌డేశాయి.

First Published:  13 Oct 2015 11:19 PM GMT
Next Story