Telugu Global
International

వ‌యాగ్రా వేసుకుని క్రికెట్.. ర‌నౌట్‌!

వ‌యాగ్రా వేసుకుని క్రికెట్ ఆడితే.. ఎలా ఉంటుంది? ఇదేంటి.. క్రీడాకారులు బ‌లంకోసం స్టిరాయిడ్లు, ఇత‌ర డ్ర‌గ్స్ పై ఆధార‌ప‌డ‌తారు గానీ, వ‌యాగ్రా వేసుకుని మైదానంలో దిగుతారా? అని ఆశ్చ‌ర్య‌పోకండి.. ఇది నిజంగానే జ‌రిగింది. వెల్ల‌డించింది ఎవ‌రో కాదు. ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ ఆండ్రూ ప్లింటాఫ్‌. ప్లింటాఫ్ ఏమ‌న్నాడంటే..? ఓ మ్యాచ్ జ‌రిగే ముందురోజు రాత్రి ఒకేసారి మూడు వ‌యాగ్రా మాత్ర‌లు వేసుకున్నా! దాని ప్ర‌భావం మ‌రునాడు కూడా కొన‌సాగింది. త‌రువాత రోజు మ్యాచ్ మొద‌లైంది. అయినా ప్ర‌భావం […]

వ‌యాగ్రా వేసుకుని క్రికెట్.. ర‌నౌట్‌!
X
వ‌యాగ్రా వేసుకుని క్రికెట్ ఆడితే.. ఎలా ఉంటుంది? ఇదేంటి.. క్రీడాకారులు బ‌లంకోసం స్టిరాయిడ్లు, ఇత‌ర డ్ర‌గ్స్ పై ఆధార‌ప‌డ‌తారు గానీ, వ‌యాగ్రా వేసుకుని మైదానంలో దిగుతారా? అని ఆశ్చ‌ర్య‌పోకండి.. ఇది నిజంగానే జ‌రిగింది. వెల్ల‌డించింది ఎవ‌రో కాదు. ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ ఆండ్రూ ప్లింటాఫ్‌. ప్లింటాఫ్ ఏమ‌న్నాడంటే..? ఓ మ్యాచ్ జ‌రిగే ముందురోజు రాత్రి ఒకేసారి మూడు వ‌యాగ్రా మాత్ర‌లు వేసుకున్నా! దాని ప్ర‌భావం మ‌రునాడు కూడా కొన‌సాగింది. త‌రువాత రోజు మ్యాచ్ మొద‌లైంది. అయినా ప్ర‌భావం కొన‌సాగుతూనే ఉంది. మా జ‌ట్టు బ్యాటింగ్ చేస్తోంది.. నా ప‌రిస్థితి ఏదోలా ఉంది. భ‌రించ‌లేని నొప్పి.. నా వంతు బ్యాటింగ్ రాకూడద‌ని దేవుడిని మ‌న‌స్సులోనే బ‌లంగా కోరుకున్నా.. అయినా నేను బ్యాటింగ్ చేయాల్సి వ‌చ్చింది… నావంతు రాగానే క్రీజులోకి వెళ్లా.. అయినా క‌ద‌లలేక‌పోతున్నా.. కాళ్లు సాధార‌ణంగా క‌ద‌ల‌లేక‌పోతున్నాయి.. భ‌రించ‌లేని నొప్పితో న‌రాలు వంక‌ర్లు తిరిగిపోతున్నాయి.. అవ‌త‌లి బ్యాట్స్‌మెన్ ప‌రుగుకు పిల‌వ‌గానే.. స‌రిగా పరిగెత్త‌లేక‌పోయా.. అంతే ర‌నౌట్ అయ్యా! అని త‌న విషాద గ‌తాన్ని నెమ‌రువేసుకున్నాడు ప్లింటాఫ్‌! పాపం ఈ ర‌హ‌స్యాన్ని ఇప్పుడెందుకు వెల్ల‌డించాడో, అప్పుడెందుకు మాత్ర‌లు వేసుకున్నాడో..ప్లింటాఫ్‌కే తెలియాలి! ఈ విష‌యం ఇప్పుడు బ‌ట్ట‌బ‌య‌లు కావ‌డంతో ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు.. ప్లింటాఫ్‌పై గుర్రుగా ఉంద‌ని స‌మాచారం.
First Published:  14 Oct 2015 1:05 AM GMT
Next Story