‘బరోడా’ కుంభకోణంలో ఇద్దరికి సీబీఐ కస్టడీ

బ్యాంక్ ఆఫ్ బరోడా కుంభకోణానికి సంబంధించి ఇద్దరు అధికారులను రెండు రోజుల సీబీఐ కస్టడీకి ఢిల్లీ కోర్టు అనుమతి ఇచ్చింది. జీడిపప్పు, బియ్యం కోనుగోలు కోసమంటూ ఆరు వేల కోట్ల నగదును పలు దఫాలుగా బ్యాంకుల ద్వారా హవాలా మార్గంలో హాంకాంగ్‌కు తరలించిన కేసులో మొత్తం ఆరుగురుని అరెస్ట్‌ చేశారు. వీరిలో సీబీఐ ఇద్దరిని, ఈడీ నలుగురిని అరెస్ట్ చేశాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా అశోక్ విహార్ శాఖకు చెందిన ఏజీఎం ఎస్.కె.గార్గ్, విదేశీ మారక విభాగం అధికారి జైనిష్ దుబేను ప్రశ్నించేందుకు సీబీఐ నాలుగు రోజుల కస్టడీ కోరింది. ఈ ఇద్దరు బ్యాంకు అధికారులు రీజనల్ కార్యాలయానికి సమాచారం ఇవ్వకుండా విదేశీ ఖాతాలకు లావాదేవీలు జరిపినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. అయితే ఇరు వర్గాల వాదనలు విన్న ఢిల్లీ కోర్టు ఇద్దరు అధికారులను రెండు రోజుల సీబీఐ కస్టడీకి అనుమతి ఇచ్చింది.