చెరవీడిన తెలుగు తమ్ముళ్లు

పది రోజుల క్రితం మావోయిస్టుల చేతిలో కిడ్నాప్‌కు గురైన విశాఖ జిల్లా టీడీపీ నేతలు క్షేమంగా బయటపడ్డారు. కిడ్నాప్ అయిన మహేష్, బాలయ్య, వి బాలయ్యను ఒడిషాలోని చిత్రకొండ అటవీ ప్రాంతంలో గిరిజన ఉద్యోగ సంఘాలకు మావోయిస్టులు అప్పగించారు. వీరిలో మహేష్ విశాఖ జిల్లా టీడీపీ కార్యదర్శిగా ఉన్నారు. ఎం బాలయ్య జీకే వీధి మండల అధ్యక్షుడుగా, వి బాలయ్య మండల ఉపాధ్యక్షుడుగా ఉన్నారు. గురువారం తెల్లవారుజామున వీరిని విడుదల చేశారు. బాక్సైట్ తవ్వకాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామంటూ ముగ్గురు నేతలతో ప్రమాణం చేయించిన తర్వాత మావోయిస్టులు విడుదల చేశారు.