Telugu Global
Cinema & Entertainment

ఒక్క‌సారితో కంట్రోల్ చేసుకోలేం..! 

కొన్ని దృశ్యాల్ని చూసినప్పుడు..ఒక్కసారి చూసి ఆగ‌లేం. మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నిపిస్తుంది.  అంత‌గా  ఎట్రాక్ట్ చేస్తుంటాయి.   అదే సినిమాల‌కు సంబంధించి అయితే.. బాలీవుడ్ లో రాజ‌శ్రీ ప్రొడ‌క్ష‌న్స్  లో వ‌చ్చే  ప్ర‌తి సినిమా న‌యనానంద‌క‌రంగా వుంటాయి. ఈ బ్యాన‌ర్ లో  స‌ల్మాన్ ఖాన్, మాధురి కాంబినేష‌న్ లో  చేసిన  ప‌లు చిత్రాలు  ఘ‌న విజ‌యం సాధించాయి. ద‌ర్శ‌కుడు  సూర‌జ్ బ‌ర‌జ‌త్యా    సినిమా  అంటే ఒక రంగులు హ‌రివిల్లు లా వుంటుంది.  నిజ  జీవితంలో ఎక్కువ మంది […]

ఒక్క‌సారితో కంట్రోల్ చేసుకోలేం..! 
X
కొన్ని దృశ్యాల్ని చూసినప్పుడు..ఒక్కసారి చూసి ఆగ‌లేం. మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నిపిస్తుంది. అంత‌గా ఎట్రాక్ట్ చేస్తుంటాయి. అదే సినిమాల‌కు సంబంధించి అయితే.. బాలీవుడ్ లో రాజ‌శ్రీ ప్రొడ‌క్ష‌న్స్ లో వ‌చ్చే ప్ర‌తి సినిమా న‌యనానంద‌క‌రంగా వుంటాయి. ఈ బ్యాన‌ర్ లో స‌ల్మాన్ ఖాన్, మాధురి కాంబినేష‌న్ లో చేసిన ప‌లు చిత్రాలు ఘ‌న విజ‌యం సాధించాయి. ద‌ర్శ‌కుడు సూర‌జ్ బ‌ర‌జ‌త్యా సినిమా అంటే ఒక రంగులు హ‌రివిల్లు లా వుంటుంది. నిజ జీవితంలో ఎక్కువ మంది జివితాల్లో జ‌ర‌క్క పోయినా.. ఎక్కువ మంది డ్రీమ్స్ ను తెర పై రెయిన్ బో లా ఆవిష‌క‌రించ‌డంలో సిద్ద హ‌స్తుడు. ఒక పెద్ద కుటుంబం. ఆకుటుంబం చుట్టు ప్రేమ‌, బంధం, అసూయ‌, విల‌నీ..ఇలా న‌వ‌ర‌సాల్సి ఫ్యామిలీ తోనే ముడి వేసి క‌థ‌ను న‌డుపుతాడు.

ఇక తాజాగా లాంగ్ గ్యాప్ త‌రువాత స‌ల్మాన్ ఖాన్, సోన‌మ్ క‌పూర్ లీడ్ రోల్స్ లో ప్రేమ్ ర‌త‌న్ ధ‌న్ పాయో చిత్రం చేశారు. ఈ సినిమా ట్రైల‌ర్ ఈమ‌ధ్య విడుద‌ల‌య్యింది. ఇక తాజాగా 2 నిముషాల నిడివి వున్న ఈ చిత్రం ట్రైల‌ర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైల‌ర్ చూస్తే ఒక్కసారి చూసి ఆగ‌లేం. మ‌ళ్లీ మ‌ళ్లీ చూడాల‌నిపిస్తుంది. అంద న‌యానంద‌క‌రంగా విజువ‌ల్స్.. శ్ర‌వాణ నంద‌ర‌కంగా సంగీతం, వున్నాయి. కావాలంటే మీరు కూడా ఓ లుక్కేయండి. ఈ చిత్రం దీపావ‌ళీ పండ‌క్కు ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. స‌ల్లుభాయ్ ను చాల కాలం త‌రువాత పూర్తి స్థాయి కుటుంబ క‌థ చిత్రంలో చూడ‌బోతున్నాం మ‌రి.

First Published:  14 Oct 2015 7:05 PM GMT
Next Story