Telugu Global
Cinema & Entertainment

ఈ ఇద్దరు ఇక తెలుగుకు దూరం

తమిళ స్టార్ హీరోలంతా తెలుగులో కూడా స్ట్రయిట్ గా సినిమాలు చేస్తామని ఊరిస్తుంటారు. కానీ కొందరు మాత్రమే ఆ దిశగా అడుగులు వేస్తారు. మరికొందరు మాత్రం దశాబ్దాల పాటు అలా స్టేట్ మెంట్లు ఇస్తూనే ఉంటారు. ఈ కోవలో ఇద్దరు హీరోలు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటే.. మరో ఇద్దరు హీరోలు మాత్రం తాము చేసిన వాగ్దానాల్ని పోస్ట్ పోన్ చేసుకున్నారు. తెలుగులో నేరుగా సినిమా చేస్తానని గతంలోనే ప్రకటించాడు కమల్ హాసన్. చెప్పినట్టుగానే చీకటిరాజ్యాన్ని తెరకెక్కించాడు. ఈ […]

ఈ ఇద్దరు ఇక తెలుగుకు దూరం
X
తమిళ స్టార్ హీరోలంతా తెలుగులో కూడా స్ట్రయిట్ గా సినిమాలు చేస్తామని ఊరిస్తుంటారు. కానీ కొందరు మాత్రమే ఆ దిశగా అడుగులు వేస్తారు. మరికొందరు మాత్రం దశాబ్దాల పాటు అలా స్టేట్ మెంట్లు ఇస్తూనే ఉంటారు. ఈ కోవలో ఇద్దరు హీరోలు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటే.. మరో ఇద్దరు హీరోలు మాత్రం తాము చేసిన వాగ్దానాల్ని పోస్ట్ పోన్ చేసుకున్నారు. తెలుగులో నేరుగా సినిమా చేస్తానని గతంలోనే ప్రకటించాడు కమల్ హాసన్. చెప్పినట్టుగానే చీకటిరాజ్యాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమాను తెలుగులోనే షూట్ చేస్తున్నారు. మరో తమిళ హీరో కార్తి కూడా తెలుగులో సినిమా చేస్తానని ప్రకటించాడు. చెప్పినట్టుగానే నాగార్జునతో కలిసి ఊపిరి అనే తెలుగు సినిమాలో నటిస్తున్నాడు. వీళ్లిద్దరికీ రివర్స్ లో విక్రమ్, సూర్య ఉన్నారు. తెలుగులో నేరుగా సినిమాలు చేస్తామని ఎప్పట్నుంచో చెబుతున్నారు ఈ హీరోలు. కానీ ఇప్పటివరకు తమ తెలుగు ప్రాజెక్టుల్ని మాత్రం ప్రకటించలేదు. తాజాగా ఇదే విషయాన్ని సూర్యను అడిగితే.. తెలుగులో స్ట్రయిట్ సినిమా చేయడానికి ఇంకెన్నేళ్లు పడుతుందో అంటూ తప్పించుకున్నాడు.
First Published:  14 Oct 2015 7:04 PM GMT
Next Story