Telugu Global
Others

రోశయ్యను చంద్రబాబు అవమానించారా?

అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానాలు పంపుతున్న తీరుపై ఏపీ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. తెలుగువాడు, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రోశయ్యకు ఏపీ ప్రభుత్వం అమరావతి ఆహ్వానాన్ని కొరియర్‌లో పంపింది. దీంతో రోశయ్య అభిమానులు, సీనియర్ నాయకులు అవాక్కయ్యారు. ఇది రోశయ్యను అవమానించడమేనంటున్నారు. సింగపూర్,జపాన్‌ మంత్రులను నేరుగా వెళ్లి ఆహ్వానిస్తున్న ప్రభుత్వం … తెలుగువాడైన రోశయ్య విషయంలో ఇలా చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చివరకు తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులకు కూడా నేరుగా వెళ్లి […]

రోశయ్యను చంద్రబాబు అవమానించారా?
X

అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానాలు పంపుతున్న తీరుపై ఏపీ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంటోంది. తెలుగువాడు, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ప్రస్తుత తమిళనాడు గవర్నర్ రోశయ్యకు ఏపీ ప్రభుత్వం అమరావతి ఆహ్వానాన్ని కొరియర్‌లో పంపింది. దీంతో రోశయ్య అభిమానులు, సీనియర్ నాయకులు అవాక్కయ్యారు.

ఇది రోశయ్యను అవమానించడమేనంటున్నారు. సింగపూర్,జపాన్‌ మంత్రులను నేరుగా వెళ్లి ఆహ్వానిస్తున్న ప్రభుత్వం … తెలుగువాడైన రోశయ్య విషయంలో ఇలా చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చివరకు తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులకు కూడా నేరుగా వెళ్లి ఆహ్వానాలు అందజేస్తామంటున్న ప్రభుత్వం గవర్నర్‌గా ఉన్న రోశయ్యకు మాత్రం కొరియర్‌లో పంపడంపై నిరసన తెలుపుతున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు కూడా ఇలాగే కొరియర్‌లో ఆహ్వానం పంపగలరా అని ప్రశ్నిస్తున్నారు.

గతంలో ప్రతిపక్షనాయకుడిగా చంద్రబాబు డొక్కుకార్ల కాన్వాయ్‌లో తిరుగుతుంటే… ముఖ్యమంత్రి హోదాలో రోశయ్యే కొత్త కాన్వాయ్ మంజూరు చేశారని వారు గుర్తు చేస్తున్నారు. ఒక్కసారిగా విమర్శలు రావడంతో ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. కేంద్రమంత్రి సుజనాచౌదరి రోశయ్యను కలిసి ఆహ్వానించారు. పనిలో పనిగా శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాన వేదికపై రోశయ్యకు చోటు కల్పించే యోచనలో ప్రభుత్వం ఉంది.

First Published:  16 Oct 2015 7:32 AM GMT
Next Story