Telugu Global
Others

కంటి ఆరోగ్యానికి 20-20-20 సూత్రం

ఆధునిక టెక్నాల‌జీ తెచ్చిన మార్పుల్లో భాగంగా మ‌న‌కు కాళ్ల‌కు శ్ర‌మ త‌గ్గి కంటికి శ్ర‌మ పెరిగిపోయింది. ఇంట్లోంచి క‌ద‌ల‌కుండానే కంప్యూట‌ర్ ముందు కూర్చుని అన్ని ప‌నులూ చేయ‌గ‌ల‌గుతున్నాం క‌దా…ఇదంతా కంటికి శ్ర‌మే. అలాగే గంట‌ల త‌ర‌బ‌డి కంప్యూట‌ర్ స్క్రీన్‌కి క‌ళ్ల‌ను అతికించేసి ఉద్యోగాలు చేస్తున్న‌వారు ఎంద‌రో. వీరంద‌రికీ చూపుకి, కంటికి సంబంధించిన స‌మస్య‌లు త్వ‌ర‌గా చుట్టుముడ‌తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి వారికోస‌మే ఓ అద్భుత‌మైన కంటి ఆరోగ్య‌సూత్రం ఉందంటున్నారు బోస్ట‌న్‌లోని ఓ హెల్త్ సైన్సెస్ కాలేజిలో […]

కంటి ఆరోగ్యానికి 20-20-20 సూత్రం
X

ఆధునిక టెక్నాల‌జీ తెచ్చిన మార్పుల్లో భాగంగా మ‌న‌కు కాళ్ల‌కు శ్ర‌మ త‌గ్గి కంటికి శ్ర‌మ పెరిగిపోయింది. ఇంట్లోంచి క‌ద‌ల‌కుండానే కంప్యూట‌ర్ ముందు కూర్చుని అన్ని ప‌నులూ చేయ‌గ‌ల‌గుతున్నాం క‌దా…ఇదంతా కంటికి శ్ర‌మే. అలాగే గంట‌ల త‌ర‌బ‌డి కంప్యూట‌ర్ స్క్రీన్‌కి క‌ళ్ల‌ను అతికించేసి ఉద్యోగాలు చేస్తున్న‌వారు ఎంద‌రో. వీరంద‌రికీ చూపుకి, కంటికి సంబంధించిన స‌మస్య‌లు త్వ‌ర‌గా చుట్టుముడ‌తాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి వారికోస‌మే ఓ అద్భుత‌మైన కంటి ఆరోగ్య‌సూత్రం ఉందంటున్నారు బోస్ట‌న్‌లోని ఓ హెల్త్ సైన్సెస్ కాలేజిలో ప్రొఫెస‌ర్‌గా ఉన్న జాక్ డెన్న‌ర్‌లీన్‌.

కంప్యూట‌ర్ ముందు కూర్చుని ప‌నిచేస్తున్న స‌మ‌యంలో ప్ర‌తి 20 నిముషాల‌కు ఒక‌సారి, 20 సెక‌న్ల పాటు విరామం తీసుకుని, మ‌న‌కు 20 అడుగుల దూరంలో ఉన్న ఏదో ఒక వ‌స్తువుని చూడ‌మంటున్నారు. ఇదే 20-20-20 సూత్రం. ఇలా చేయ‌డం వ‌ల‌న క‌ళ్లు విప‌రీత‌మైన శ్ర‌మ‌కు గురికావ‌డం వ‌ల‌న త‌లెత్తే స‌మ‌స్య‌లు…క‌ళ్లు నీరు కార‌డం, ఎర్ర‌బార‌డం, దుర‌ద‌ మంట రావ‌డం, పొడిబార‌డం…లాంటివి రాకుండా ఉంటాయ‌ని జాక్‌ స‌ల‌హా ఇస్తున్నారు.

కూర్చున్న చోటునుండి క‌ద‌ల‌కుండా కంటికి ఆరోగ్యాన్నిచ్చే చ‌క్క‌ని వ్యాయామం ఇది. ఇదే వ్యాయామాన్ని మ‌రోలా చేయ‌వ‌చ్చ‌ని, ఇర‌వై నిముషాల‌కు ఒక‌సారి లేచి ఇర‌వై అడుగుల దూరం, ఇర‌వై సెక‌న్ల‌పాటు న‌డిచినా మ‌రింత మంచిద‌ని ఆయ‌న చెబుతున్నారు. ఎలాగూ ఇర‌వై నిముషాల‌కు ఒక‌సారి సీటులోంచి లేవ‌డం క‌ష్టం క‌నుక చూపుని మ‌ర‌ల్చ‌డ‌మే మంచిది. తేలిగ్గా కంటి ఆరోగ్యాన్నిపెంచుకోవ‌చ్చు. ది న్యూయార్క్ టైమ్స్‌లో ఈ ఆర్టిక‌ల్‌ని ప్ర‌చురించారు.

First Published:  16 Oct 2015 3:24 AM GMT
Next Story