ఎస్.ఐ.ని నరికి చంపిన బైక్‌ దొంగలు

కర్ణాటక రాష్ట్రంలోని దొడ్డబళ్లాపురంలో బైక్‌ దొంగలు బరి తెగించారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో ఫోర్‌ వీలర్‌లు, బైక్‌ల దొంగతనాలు పెరిగి పోయాయి. వీటిని అరికట్టేందుకు ఎన్ని రకాలుగా పోలీసులు ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు. తాజాగా దొడ్డబళ్ళాపూర్‌లో జరిగిన ఓ సంఘటనలో బైక్‌ దొంగల ఆచూకీ తెలిసింది. దాంతో వారిని పట్టుకోవడానికి ఆ ప్రాంతానికి వెళ్ళిన ఎస్‌.ఐ.పై దొంగలు కత్తులతో దాడి చేశారు. తాను తప్పించుకునేందుకు ఎస్‌.ఐ. చేసిన ప్రయత్నం ఫలించలేదు. చివరికి వారి కత్తులకు అతను బలై పోయాడు. తుదకు నరికి చంపారు. అనంతరం ఎస్‌‌.ఐ. సర్వీస్‌ రివాల్వర్‌తో దుండగులు పరార్‌ అయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు దొంగల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.