Telugu Global
NEWS

కృష్ణా వివాదంలో కేంద్రం మౌనంపై సుప్రీం ఆగ్రహం

కృష్ణా జలాల వివాదానికి సంబంధించి కేంద్రం తనకు సంబంధం లేకుండా వ్యవహరించడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. వివాదం సృష్టించిన కేంద్ర ప్రభుత్వం దాన్ని సరి చేయాల్సింది పోయి మౌనం దాల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వివాదం సృష్టించింది మీరే కదా మీ వైఖరి చెప్పకుండా ఉంటే ఎలా’ అని ప్రశ్నించింది. కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు దాఖలు చేసిన ఐదు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్లపైన, పంపకాలు మళ్ళీ జరపాలని తెలంగాణ పెట్టుకున్న పిటిషన్‌పైన విచారణ […]

కృష్ణా జలాల వివాదానికి సంబంధించి కేంద్రం తనకు సంబంధం లేకుండా వ్యవహరించడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. వివాదం సృష్టించిన కేంద్ర ప్రభుత్వం దాన్ని సరి చేయాల్సింది పోయి మౌనం దాల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వివాదం సృష్టించింది మీరే కదా మీ వైఖరి చెప్పకుండా ఉంటే ఎలా’ అని ప్రశ్నించింది. కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాలు దాఖలు చేసిన ఐదు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్లపైన, పంపకాలు మళ్ళీ జరపాలని తెలంగాణ పెట్టుకున్న పిటిషన్‌పైన విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబట్టింది. జస్టిస్‌ దీపక్‌మిశ్రా, జస్టిస్‌ ప్రఫుల్లపంత్‌లతో కూడిన ధర్మాసనం గంటన్నరపాటు విచారణ అనంతరం కేసును డిసెంబర్‌ 3వ తేదీకి వాయిదా వేసింది.

కృష్ణా జలాల పంపిణీ రాష్ట్రాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని విభజించాలా లేక ప్రాజెక్టులో నీటి లభ్యతను బట్టి విభజించాలా అన్న విషయంలో తమకు స్పష్టత రావడంలేదని కోర్టు అబిప్రాయపడింది. కర్ణాటక, మహారాష్ట్రలు 95 శాతం నీటిని ఉపయోగించుకుంటున్నాయని, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలకు తాగు, సాగు నీరు అసలు అందడం లేదని ఇరు రాష్ట్రాల న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. ఈ యేడాది తాగునీరు కూడా రాలేదని తెలంగాణ ప్రతినిధి చెప్పారు. కృష్ణా జలాల పంపిణీకి కొత్త ట్రిబ్యునల్‌ వేయాల్సిందేనని వాదించారు. ఈ వాదనలు అన్నీ విన్న న్యాయమూర్తులు కేంద్రం తన వైఖరిని స్పష్టం చేయాలని, దీనిపై తీర్పు ఇవ్వడం సాధ్యం కాదని ప్రకటించారు. కొత్త రాష్ట్రం సృష్టించిందే మీరే కదా… మౌనంగా ఉంటే ఎలా అని న్యాయమూర్తులు ప్రశ్నించారు.

First Published:  16 Oct 2015 3:11 AM GMT
Next Story