Telugu Global
Others

చంద్రబాబుకు కేంద్రం మొదటి వార్నింగ్

గతంలో చంద్రబాబు పని తీరుని పరిశీలించిన వారు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటి ఆయన పని తీరును గమనించిన వారు ఈయన మన చంద్రబాబేనా అని ఆశ్చర్యపోతున్నారు. దిక్కులేకుండా ఉన్నాం, అనాధలుగా ఉన్నాం ఆధారం లేకుండా ఉన్నాం అంటూ ప్రజల సెంటిమెంటును రెచ్చగొడుతూనే తన కోసం కోట్లాది రూపాయలను మంచి నీటిప్రాయంగా ఖర్చు పెడుతూ ఉండటం సాధారణ పౌరులకు కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. ముఖ్యమంత్రి కాగానే తన కార్యాలయ మరమత్తులకు, క్యాంపు ఆఫీసు సుందరీకరణకు, విజయవాడలో క్యాంపు […]

చంద్రబాబుకు కేంద్రం మొదటి వార్నింగ్
X

గతంలో చంద్రబాబు పని తీరుని పరిశీలించిన వారు, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పటి ఆయన పని తీరును గమనించిన వారు ఈయన మన చంద్రబాబేనా అని ఆశ్చర్యపోతున్నారు. దిక్కులేకుండా ఉన్నాం, అనాధలుగా ఉన్నాం ఆధారం లేకుండా ఉన్నాం అంటూ ప్రజల సెంటిమెంటును రెచ్చగొడుతూనే తన కోసం కోట్లాది రూపాయలను మంచి నీటిప్రాయంగా ఖర్చు పెడుతూ ఉండటం సాధారణ పౌరులకు కూడా ఆశ్చర్యం కలిగిస్తోంది. ముఖ్యమంత్రి కాగానే తన కార్యాలయ మరమత్తులకు, క్యాంపు ఆఫీసు సుందరీకరణకు, విజయవాడలో క్యాంపు ఆఫీసుకోసం కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టడం, అక్రమనిర్మాణంగా తేల్చిన లింగమనేని గెస్ట్‌హౌస్‌కు కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి మరమత్తులు చేయించడం, పట్టిసీమ పంపును రైతులకు చూపించడానికి కోట్లు కేటాయించడం, జయప్రకాష్‌ నారాయణ గారు ఆరోపించినట్లు వందకోట్లకు పైన ఖర్చుపెట్టి ప్రైవేట్‌ విమానాల్లో తిరగడం, రాజధాని భూమి పూజకు, శంకుస్థాపనకు (ఈ రెండింటికి తేడా ఏమిటో) పెద్దమొత్తంలో ఖర్చులు పెడుతుండడంపై ప్రతిపక్షాలు, పౌరసంఘాలు ఇప్పటివరకు నిరసనలు తెలియజేశాయి.
ఇప్పుడు మొదటిసారిగా ప్రధాని కార్యాలయం నోరువిప్పింది. ఈ ఖర్చులేమిటని నిలదీసింది. రాష్ట్రానికి కేంద్రానికి తేడాతెలియకుండా, ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి వ్యత్యాసం గమనించకుండా ఇతర దేశాల ప్రధానులను, అధ్యక్షులను కేంద్రం అనుమతిలేకుండా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వయంగా ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించింది. ఇలా అయితే రేపు శంకుస్థాపనకు ప్రధాని రావడం అనుమానాస్పదమేనని హెచ్చరించింది.
పర్యావరణవేత్తలు, మేధావులు, ప్రజాసంఘాలు అనేకం అమరావతిలో రాజధాని నిర్మాణంపై నిరసనలు వ్యక్తం చేస్తూ ప్రధానికి లేఖలు రాసారు. చంద్రబాబు భూసేకరణ తీరుకూడా కేంద్రం ప్రవేశపెట్టాలనుకున్న భూసేకరణ చట్టాన్ని దెబ్బతీసింది. ఆ విషయంలో నరేంద్రమోడీ చంద్రబాబుపై గుర్రుగా ఉన్నారు. వెంకయ్యనాయుడు అడుగడుగునా అడ్డుపడకపోతే చంద్రబాబుపై మోడీ ఎప్పుడో ఫైర్‌ అయ్యేవారు. వెంకయ్యనాయుడి రాయబారాలతో ఇప్పటివరకు సర్దుకుపోయిన కేంద్రం మొదటిసారి చంద్రబాబుకు తమ నిరసనను తెలియజేసింది. ఈ మొదటి ప్రమాద హెచ్చరికతో చంద్రబాబు జాగ్రత్తపడకపోతే పరిణామాలు ఎలా ఉంటాయో చూడాలి.

First Published:  16 Oct 2015 1:16 PM GMT
Next Story