Telugu Global
Others

చైనాలోనే టాప్ బిలియనీర్స్

సవాళ్లు ఎదుర్కొంటూ.. అవకాశాలను అందిపుచ్చుకుంటూ అభివృద్ధి పథంలో సాగిపోతున్న చైనా మరో మైలురాయిని దాటింది. అత్యంత ధనవంతులుండే అమెరికాను సైతం దాటిపోయింది చైనా. అవును చైనాలో ఇప్పుడు బిలియనీర్ల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. వరల్డ్ బ్యాంక్ ఇటీవల చైనా అభివృద్ధి రేటును 7.1% నుంచి 6.9%కు తగ్గించింది. అయినా ఆదేశంలో బిలియనీర్‌ల సంఖ్యమాత్రం 32% పెరిగింది. దీనంతటికీ ఇటీవల టెక్నాలజీ, తయారీ రంగాల్లో ఘననీయమైన అభివృద్ధిని సాధించడమే దీనికి కారణమని అంచనా వేశారు. అమెరికాలో 537 మంది […]

చైనాలోనే టాప్ బిలియనీర్స్
X

సవాళ్లు ఎదుర్కొంటూ.. అవకాశాలను అందిపుచ్చుకుంటూ అభివృద్ధి పథంలో సాగిపోతున్న చైనా మరో మైలురాయిని దాటింది. అత్యంత ధనవంతులుండే అమెరికాను సైతం దాటిపోయింది చైనా. అవును చైనాలో ఇప్పుడు బిలియనీర్ల సంఖ్య భారీగా పెరిగిపోతోంది. వరల్డ్ బ్యాంక్ ఇటీవల చైనా అభివృద్ధి రేటును 7.1% నుంచి 6.9%కు తగ్గించింది. అయినా ఆదేశంలో బిలియనీర్‌ల సంఖ్యమాత్రం 32% పెరిగింది. దీనంతటికీ ఇటీవల టెక్నాలజీ, తయారీ రంగాల్లో ఘననీయమైన అభివృద్ధిని సాధించడమే దీనికి కారణమని అంచనా వేశారు.

అమెరికాలో 537 మంది బిలియనీర్లు ఉండగా.. చైనాలో ఆ సంఖ్య 596కు చేరుకుంది. హాంకాంగ్ కు చెందిన 119 బిలియనీర్లను కూడా కలుపుకుంటే ఆ సంఖ్య 717కు చేరుతుందని దీనిపై అధ్యయనం చేసిన హురూన్ సంస్థ నిపుణులు చెబుతున్నారు. ఈ ఏడాదే 242 మంది బిలియనీర్ల జాబితాలో చేరినట్టు రీసెర్చ్ సంస్థ తెలిపింది. ఆ సంపద మొత్తం లెక్కిస్తే అది 2.1 ట్రిలియన్ డాలర్లుగా లెక్కతేలింది. చాలా దేశాల జీడీపీ కన్నా ఇది ఎంతో ఎక్కువని హరూన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. మొత్తం మీద చైనా ఇప్పుడు జనాభాతోపాటే అభివృద్ధిపథంలోనూ దూసుకుపోతోంది. ప్రపంచ దేశాల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది.

First Published:  16 Oct 2015 1:10 PM GMT
Next Story