Telugu Global
Others

అమరావతికి కేసీఆర్- బాబు ఆహ్వానానికి ఓకే!

ఉత్కంఠకు తెరపడింది. ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడింది. ఎవరు వెళ్తారన్నదానిపై క్లారిటీ వచ్చింది. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరవుతున్నట్టు ప్రకటించారు. బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయానికి ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా వెళ్లారు. క్యాంపు కార్యాలయానికి చంద్రబాబు చేరుకోగానే కేసీఆర్ చంద్రబాబును సాదరంగా లోపలకు ఆహ్వానించారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా కేసీఆర్ ను కుటుంబ సమేతంగా రావాలని చంద్రబాబు ఆహ్వానించారు. ఆహ్వాన పత్రికతోపాటు తిరుపతి లడ్డును కేసీఆర్ కు చంద్రబాబు […]

అమరావతికి కేసీఆర్- బాబు ఆహ్వానానికి ఓకే!
X

ఉత్కంఠకు తెరపడింది. ఊహాగానాలకు ఫుల్ స్టాప్ పడింది. ఎవరు వెళ్తారన్నదానిపై క్లారిటీ వచ్చింది. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా హాజరవుతున్నట్టు ప్రకటించారు. బేగంపేటలోని సీఎం క్యాంపు కార్యాలయానికి ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా వెళ్లారు. క్యాంపు కార్యాలయానికి చంద్రబాబు చేరుకోగానే కేసీఆర్ చంద్రబాబును సాదరంగా లోపలకు ఆహ్వానించారు. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి రావాల్సిందిగా కేసీఆర్ ను కుటుంబ సమేతంగా రావాలని చంద్రబాబు ఆహ్వానించారు.
ఆహ్వాన పత్రికతోపాటు తిరుపతి లడ్డును కేసీఆర్ కు చంద్రబాబు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు వెంట టీటీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్ రమణ ఉన్నారు. అటు కేసీఆర్ నివాసంలో మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి కూడా హాజరయ్యారు. అనంతరం సీఎం కేసీఆర్, చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. సుమారు 50 నిమిషాలపాటు జరిగిన సమావేశంలో కేవలం అమరావతి శంకుస్థాపన గురించే కాకుండా రాజకీయపరమైన అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు సమాచారం.
ఈ సందర్భంగా తాను అమరావతి శంకుస్థాపనకు వెళ్తున్నట్టు కేసీఆర్ ప్రకటించారు. సీఎం కేసీఆర్ 21వ తేది హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరతారు. రాత్రి సూర్యపేటలో బసచేస్తారు. 22వ తేది ఉదయం సూర్యాపేట నుంచి రోడ్డు మార్గంలో అమరావతికి కేసీఆర్ వెళ్లనున్నారు. సుమారు 8 నెలల తర్వాత చంద్రబాబు.. కేసీఆర్ ను కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరు సీఎంలు జల వివాదాలను ప్రత్యేకంగా సమావేశమై చర్చించుకోవాలని నిర్ణయించారు.

First Published:  18 Oct 2015 10:16 AM GMT
Next Story