Telugu Global
Cinema & Entertainment

మరో స్టార్ కిడ్ పై కన్నేసిన సల్మాన్ ఖాన్

సూరజ్ పంచోళీ కొడుకు ఆదిత్య పంచోళీని హీరోని చేసింది సల్మాన్ ఖానే. సొంత బ్యానర్ పై ఆదిత్య పంచోళీ హీరోగా సినిమా నిర్మించాడు సల్మాన్ ఖాన్. ఇప్పుడు కండల వీరుడు మరో హీరో కొడుకును కూడా వెండితెరకు పరిచయం చేసేందుకు సిద్ధమౌతున్నాడు. సునీల్ షెట్టి కొడుకు ఆహాన్ ను హీరోగా పరిచయం చేసేందుకు ప్లాన్స్ రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే సునీల్ షెట్టి కూతురు అతియా షెట్టిని వెండితెరకు పరిచయం చేశాడు సల్మాన్. ఇప్పుడు తనయుడు ఆహాన్ ను […]

మరో స్టార్ కిడ్ పై కన్నేసిన సల్మాన్ ఖాన్
X
సూరజ్ పంచోళీ కొడుకు ఆదిత్య పంచోళీని హీరోని చేసింది సల్మాన్ ఖానే. సొంత బ్యానర్ పై ఆదిత్య పంచోళీ హీరోగా సినిమా నిర్మించాడు సల్మాన్ ఖాన్. ఇప్పుడు కండల వీరుడు మరో హీరో కొడుకును కూడా వెండితెరకు పరిచయం చేసేందుకు సిద్ధమౌతున్నాడు. సునీల్ షెట్టి కొడుకు ఆహాన్ ను హీరోగా పరిచయం చేసేందుకు ప్లాన్స్ రెడీ చేస్తున్నాడు. ఇప్పటికే సునీల్ షెట్టి కూతురు అతియా షెట్టిని వెండితెరకు పరిచయం చేశాడు సల్మాన్. ఇప్పుడు తనయుడు ఆహాన్ ను కూడా తెరపైకి తీసుకొస్తాడు. ఆహాన్ తో సినిమా పూర్తయిన తర్వాత.. తను పరిచయం చేసిన ఇద్దరు హీరోలను కలిపి ఓ మల్టీస్టారర్ మూవీ తీసే ఆలోచనలో ఉన్నాడు సల్మాన్. మొత్తానికి అటు హీరోగా నటిస్తూనే, ఇటు నిర్మాతగా కూడా బిజీ అయిపోయాడు కండల హీరో. బీయింగ్ హ్యూమన్ బ్యానర్ పై భవిష్యత్తులో మరిన్ని సినిమాలు నిర్మించాలనుకుంటున్నాడు.
First Published:  17 Oct 2015 7:02 PM GMT
Next Story