Telugu Global
NEWS

కేశినేని స్థానంలోకి లగడపాటి?

కృష్ణాజిల్లా రాజకీయాల్లో కేశినేని నాని స్థానంలోకి లగడపాటి రాజగోపాల్‌ రావడం ఖరారైందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ సన్యాసం తీసుకుని సైలెంట్‌గా ఉన్న విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్లీ పాలిటిక్స్‌లో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాజకీయాలకు బాగా అలవాటు పడ్డ లగడపాటి …అవి లేకుండా ఉండడం సాధ్యం కాదన్న నిర్ధారణకు వచ్చారని చెబుతున్నారు. రాజకీయాలకుతోడు తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న లగడపాటి అధికార రాజకీయాల్లో ఉంటే తప్ప ఆర్ధిక […]

కేశినేని స్థానంలోకి లగడపాటి?
X

కృష్ణాజిల్లా రాజకీయాల్లో కేశినేని నాని స్థానంలోకి లగడపాటి రాజగోపాల్‌ రావడం ఖరారైందని తెలుగుదేశం వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ సన్యాసం తీసుకుని సైలెంట్‌గా ఉన్న విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మళ్లీ పాలిటిక్స్‌లో యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. రాజకీయాలకు బాగా అలవాటు పడ్డ లగడపాటి …అవి లేకుండా ఉండడం సాధ్యం కాదన్న నిర్ధారణకు వచ్చారని చెబుతున్నారు. రాజకీయాలకుతోడు తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న లగడపాటి అధికార రాజకీయాల్లో ఉంటే తప్ప ఆర్ధిక ఇబ్బందులనుంచి బయటపడలేనని, అధికార రాజకీయల్లో ఉంటేనే బ్యాంకుల వత్తిళ్ళనుంచి తట్టుకోవచ్చని, అధికార పార్టీ అండతో నాలుగు కాంట్రాక్టులు పొందవచ్చని నమ్ముతున్న లగడపాటి ఇక ఆంధ్రరాష్ట్రంలో ఇప్పుడప్పుడే అధికారంలోకి వచ్చే అవకాశంలేని కాంగ్రెస్‌పార్టీని వీడి అధికారపార్టీలోకి చేరాలనుకున్నారు. ఇందులో భాగంగా ఏ పార్టీలో చేరాలన్న దానిపై బాగా తర్జనభర్జన పడ్డ లగడపాటి చివరకు టీడీపీలో చేరాలని నిర్ణయించుకున్నారని సమాచారం.

ఇటీవల ఢిల్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును ప్రత్యేకంగా కలిసిన లగడపాటి ఆ సమయంలోనే తన మనసులో మాట వివరించారని తెలుస్తోంది. టీడీపీ చేరేందుకు అవకాశం ఇవ్వాలని కోరారని చెప్పుకుంటున్నారు. దానికి చంద్రబాబు కూడా వెంటనే ఒకే చేశారని అంటున్నారు. అయితే లగడపాటిని టీడీపీలో చేర్చుకోవడం వెనుక భారీ మనీ డీల్ ఉందని వార్తలొస్తున్నాయి. పార్టీ ఫండ్ పేరుతో వంద కోట్లు ముట్టజెప్పేందుకు రాజగోపాల్ అంగీకరించారని చెప్పుకుంటున్నారు.

టీడీపీలో చేర్చుకున్నందుకు ప్రతిఫలంగా లగడపాటి వంద కోట్లు ముట్టజెప్పేందుకు సిద్ధమయ్యారని టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారని ఓ ప్రముఖ తెలుగు దిన పత్రిక కథనాన్ని కూడా ప్రచురించింది. టీడీపీలో భవిష్యత్తుపైనా చంద్రబాబు .. లగడపాటికి హామీ ఇచ్చారని కూడా సదరు పత్రిక రాసింది. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీ టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు అంగీకరించారని టీడీపీ నేతలు కూడా చెబుతున్నారు. అప్పటి వరకు పార్టీ కార్యక్రమాల్లో తగిన ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారని సమచారం.

ఈ పరిణామంపై ప్రస్తుత విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని గుర్రుగా ఉన్నారు. ప్రత్యర్థిని పార్టీలోకి ఎలా తెస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే కేశినేని నానిపై చంద్రబాబుకు మంచి అభిప్రాయం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. బహిరంగ వేదికలపైనే పార్టీ, ప్రభుత్వ విధానాలను కేశినేని గతంలో విమర్శించారు. పవన్ కల్యాణ్ విషయంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పార్టీకి తలనొప్పులు తెచ్చారు. ఈ నేపథ్యంలో కేశినేనిపై చంద్రబాబుకు సదాభిప్రాయం లేదని పార్టీ నేతలు చెబుతున్నారు. అంతా అనుకున్నట్టు జరిగితే లగడపాటి రాక త్వరలోనే ఉంటుందని చెబుతున్నారు. లగడపాటి కూడా తనకున్న వ్యాపారాల ద‌ృష్ణ్యా అధికార పార్టీ నీడ ఎంతో అవసరమని భావిస్తున్నారు.

First Published:  19 Oct 2015 1:17 AM GMT
Next Story