Telugu Global
Cinema & Entertainment

విశాల్ విజయం వెనుక

నడిగర్ సంఘం ఎన్నికలు. పేరుకు దక్షణ భారత సినీనటుల సంఘం. కానీ అధిపత్యం మొత్తం తమిళ స్టార్లదే. సంఘం ఉన్న గడ్డ కూడా తమిళనాడే. అలాంటి చోట తమిళుడు కాని వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడమే సాహసం. పాతుకుపోయిన శరత్ కుమార్ లాంటి వారిపైకి కాలు దువ్వడం అంతకు మించిన దుస్సాహసం. అలాంటి పరిస్థితుల్లో శరత్‌కుమార్‌కు వ్యతిరేకంగా విశాల్ గళమెత్తడం మొదట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రాంతీయఅభిమానం నరనరాన జీర్ణించుకపోయిన చోట తెలుగువాడు బరిలో దిగితే జరిగే పరిణాలమాలను […]

విశాల్ విజయం వెనుక
X

నడిగర్ సంఘం ఎన్నికలు. పేరుకు దక్షణ భారత సినీనటుల సంఘం. కానీ అధిపత్యం మొత్తం తమిళ స్టార్లదే. సంఘం ఉన్న గడ్డ కూడా తమిళనాడే. అలాంటి చోట తమిళుడు కాని వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేయాలనుకోవడమే సాహసం. పాతుకుపోయిన శరత్ కుమార్ లాంటి వారిపైకి కాలు దువ్వడం అంతకు మించిన దుస్సాహసం. అలాంటి పరిస్థితుల్లో శరత్‌కుమార్‌కు వ్యతిరేకంగా విశాల్ గళమెత్తడం మొదట్లో అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రాంతీయఅభిమానం నరనరాన జీర్ణించుకపోయిన చోట తెలుగువాడు బరిలో దిగితే జరిగే పరిణాలమాలను విశాల్‌కు వివరించిన వారు ఉన్నారు. కానీ ఏకచక్రాధిపత్యాన్ని ఎదురిస్తే తప్పక విజయం ఉంటుందన్న మొండి సూత్రంతో విశాల్ ముందుకెళ్లారు.

విశాల్‌కు మద్దతు పలికిన వారిలో రహస్య మిత్రులే ఎక్కువ. ఓటు వరకు మాత్రమే గ్యారంటీ ఇచ్చారు. కొందరు యువ సభ్యులు మాత్రం మొండిగా ముందుకొచ్చి బహిరంగంగానే నిలబడ్డారు. కానీ ఎన్నికల్లో తమిళ సెంటిమెంట్‌ను శరత్ కుమార్, ఆయన భార్య రాధిక ఓ రేంజ్‌లో రెచ్చగొట్టారు. చివరకు విశాల్ తెలుగువాడు అని గుర్తు చేయడానికి ఎన్నికల ప్రచారంలో పదేపదే అతడి కులం పేరును కూడా ప్రస్తావిస్తూ వచ్చారు. అయితే పదేళ్లు నడిగర్ అధ్యక్షుడిగా ఉన్నా ఏమీ చేయకపోవడంతో శరత్‌కుమార్‌ను తమిళ సెంటిమెంట్ కూడా కాపాడలేకపోయింది. దీనికి తోడు కమల్ హాసన్ లాంటి స్టార్ బహిరంగంగా మద్దతు పలకడంతో విశాల్ వర్గంలో కాస్త ధైర్యాన్ని నింపింది. స్థాన బలం లేని చోట పోరాటం అంటే ఆషామాషీ కాదు. అందుకే పోలింగ్ బూత్‌లోనే విశాల్‌పై శరత్ కుమార్ వర్గం చుట్టు ముట్టి దాడి చేయగలిగింది.

శరత్‌కుమార్‌పై విశాల్ ఈ స్థాయిలో కక్ష గట్టి పగసాధించడానికి వ్యక్తిగత కారణాలు కూడా ఉన్నాయని చెబుతుంటారు . శరత్ కుమార్ కూతురు, నటి వరలక్ష్మి, హిరో విశాల్ చాలా కాలంపాటు చెట్టపట్టాలేసుకుని తిరిగారు. పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. వీరి పెళ్లికి విశాల్ కుటుంబం అభ్యంతరం చెప్పకపోయినా శరత్ కుమార్‌ మాత్రం తన కూతురునిచ్చి పెళ్లి చేసే ప్రసక్తే లేదని విశాల్ మొహం మీదే చెప్పేశారని తమిళవర్గాలు చెబుతుంటాయి. ఆ అవమానానికి ప్రతీకారంగానే నడిగర్‌లో శరత్‌కుమార్‌పై విశాల్ కత్తిదూశారని చాలా మంది భావన.

ఈ గెలుపు కోసం దాదాపు రెండేళ్ల నుంచి విశాల్ గ్రౌండ్ వర్క్ చేశారు. దక్షిణ భారతమంతా తిరిగి నడిగర్ సభ్యుల మద్దతు కూడగట్టారు. ముఖ్యంగా చిన్నచిన్న నటులు, యువత నుంచి విశాల్ మద్దతు సంపాదించడంలో విజయం సాధించారు. తెలుగు మూవీ అరిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మురళీమోహన్ వర్గాన్ని మార్పు పేరుతో రాజేంద్రప్రసాద్ చిత్తు చేయడంతో విశాల్‌కు తాను వెళ్తున్న దారిపై మరింత నమ్మకం కుదిరింది. ఇక్కడ మురళీ మోహన్ తరహాలోనే అక్కడ శరత్ కుమార్ పదేళ్ల పాటు నడిగర్‌ను శాసించారు. దీంతో చాలా మందిలో అప్పటికే ఆయనపై అసంత‌‌ృప్తి తీవ్ర స్థాయిలో ఉంది. వీటన్నింటిని అందరి కంటే ముందే లెక్క కట్టిన విశాల్ అందరికంటే ముందుగానే శరత్‌కుమార్‌కు వ్యతిరేకంగా గళమొత్తి నడిగర్ నేత అనిపించుకున్నారు.

First Published:  19 Oct 2015 4:30 AM GMT
Next Story