Telugu Global
Cinema & Entertainment

బెంగాల్ టైగర్ ట్రయిలర్ రివ్యూ

ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. ఫ్రెష్ స్టాక్ దించామా లేదా అనేది ఇంపార్టెంట్. సంపత్ నంది విషయంలో అదే జరిగింది. రచ్చ తర్వాత పూర్తిగా బ్యాక్ బెంచ్ కే ఫిక్స్ అయిపోయాడు సంపత్ నంది. తర్వాత పవన్ తో గబ్బర్ సింగ్-2 అంతా చాలా రోజులు తెరవెనకే ఉండిపోయాడు. తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చి బెంగాల్ టైగర్ స్టార్ట్ చేశాడు. రచ్చ తర్వాత లాంగ్ గ్యాప్ ఇచ్చి సంపత్ నంది తెరకెక్కించిన బెంగాల్ టైగర్.. వెరీ ఫ్రెష్ లుక్ […]

బెంగాల్ టైగర్ ట్రయిలర్ రివ్యూ
X
ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా.. ఫ్రెష్ స్టాక్ దించామా లేదా అనేది ఇంపార్టెంట్. సంపత్ నంది విషయంలో అదే జరిగింది. రచ్చ తర్వాత పూర్తిగా బ్యాక్ బెంచ్ కే ఫిక్స్ అయిపోయాడు సంపత్ నంది. తర్వాత పవన్ తో గబ్బర్ సింగ్-2 అంతా చాలా రోజులు తెరవెనకే ఉండిపోయాడు. తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చి బెంగాల్ టైగర్ స్టార్ట్ చేశాడు. రచ్చ తర్వాత లాంగ్ గ్యాప్ ఇచ్చి సంపత్ నంది తెరకెక్కించిన బెంగాల్ టైగర్.. వెరీ ఫ్రెష్ లుక్ తో ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఈ సినిమా టీజర్, ట్రయిలర్ ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. రవితేజ ఎనర్జీకి, సంపత్ నంది టేకింగ్ తోడవ్వడంతో ట్రయిలర్ తోనే మెరుపులు మెరిపించింది బెంగాల్ టైగర్. మరోవైపు తమన్న, రాశిఖన్నా అందాలు సినిమాకు ఎక్స్ ట్రా ఫిట్టింగ్స్ గా పనికొస్తున్నాయి. ఇవన్నీ ఒకెత్తయితే.. మూవీలో డైలాగ్స్ మరో ఎత్తు సినిమాలో కొన్ని డైలాగ్స్ ను మచ్చుకు కొన్ని ట్రయిలర్ లో విడుదల చేశారు. ఇనిస్టెంట్ గా పేలాయి ఆ డైలాగులు. దీంతో బెంగాల్ టైగర్ పై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఈ అంచనాల్ని అందుకొని, కిక్-2 పరాజయాన్ని రవితేజ మరిపిస్తాడా లేదా అనే విషయం వచ్చేనెల తేలిపోతుంది.
First Published:  18 Oct 2015 7:07 PM GMT
Next Story