Telugu Global
NEWS

దుర్గమ్మ మొక్కు చెల్లించనున్న కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ అమరావతి శంకుస్థాపనకు హెలికాఫ్టర్ లోనే వెళ్లాలని నిర్ణయించారు. మరోవైపు ఈ పర్యటనలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి మొక్కు కూడా తీర్చుకుంటారని టీఆర్ఎస్  పార్టీ వర్గాలు తెలిపాయి.   అమరావతి శంకుస్థాపనకు ఒక రోజు ముందే అంటే ఈనెల 21న హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు రోడ్డు మార్గంలో కేసీఆర్ వెళ్తారు. మొదట్లో రోడ్డు మార్గంలోనే అమరావతి వెళ్లాలని కేసీఆర్ భావించినప్పటికి… విజయవాడకు అలా ప్రయాణించడం సేఫ్ కాదని పోలీసులు సూచించారు. దీంతో […]

దుర్గమ్మ మొక్కు చెల్లించనున్న కేసీఆర్
X

తెలంగాణ సీఎం కేసీఆర్ అమరావతి శంకుస్థాపనకు హెలికాఫ్టర్ లోనే వెళ్లాలని నిర్ణయించారు. మరోవైపు ఈ పర్యటనలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి మొక్కు కూడా తీర్చుకుంటారని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు తెలిపాయి.
అమరావతి శంకుస్థాపనకు ఒక రోజు ముందే అంటే ఈనెల 21న హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు రోడ్డు మార్గంలో కేసీఆర్ వెళ్తారు. మొదట్లో రోడ్డు మార్గంలోనే అమరావతి వెళ్లాలని కేసీఆర్ భావించినప్పటికి… విజయవాడకు అలా ప్రయాణించడం సేఫ్ కాదని పోలీసులు సూచించారు. దీంతో సూర్యాపేట నుంచి హెలికాప్టర్ లో గన్నవరం ఎయిర్ పోర్టుకు కేసీఆర్ వెళ్తారు. అక్కడి నుంచి రాజధాని శంకుస్థాపన ప్రాంతానికి ప్రత్యేక హెలికాఫ్టర్ లో కేసీఆర్ ను తీసుకెళతామని ఏపీ అధికారులు ఇప్పటికే తెలంగాణ సీఎంఓకు సమాచారం అందించారు.
అమరావతి శంకుస్థాపనకు వెళుతున్న సీఎం కేసీఆర్ ఈసారి విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ముక్కు పుడక మొక్కు కూడా తీర్చుకోనున్నారు. తెలంగాణ రాష్ట్రం సిద్దిస్తే అమ్మవారికి ముక్కుపుడక సమర్పిస్తానని కేసీఆర్ అప్పట్లో మొక్కు కున్నారు. సుమారు 10 నుంచి 15గ్రాముల బరువైన బంగారు ముక్కు పుడకను కేసీఆర్ అమ్మవారికి సమర్పించనున్నారు. కేసీఆర్ తో పాటు ఆయన వెంట వచ్చే మంత్రులు, ఇతర ఉన్నతాధికారుల కోసం ఏపీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. ఉద్దండరాయునిపాలెం వచ్చేందుకు తెలంగాణ అధికారులకు రూట్‌ మ్యాప్ అందజేశారు.

First Published:  20 Oct 2015 2:12 AM GMT
Next Story