Telugu Global
Others

ల్యాంకోహిల్స్ కోస‌మే టీడీపీలోకి?

విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ టీడీపీలో చేరిక‌ దాదాపు ఖ‌రారైంది. ఇందుకు సంబంధించిన డీల్ కూడా కుదిరింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌నకున్న అంగ అర్ధ‌బ‌లానికి ఇప్ప‌టికిప్పుడు బీజేపీలో చేర‌గ‌ల‌డు. టీడీపీలోనే ఎందుకు చేరుతున్నాడ‌న్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ ఇప్పుడు విజ‌య‌వాడ అంతా న‌డుస్తోంది. దీనికి అంత‌టికీ కార‌ణం తెలంగాణ‌లోని ఆయ‌న ఆస్తులేన‌ని విజ‌య‌వాడ టీడీపీనేత‌లు చెవులు కొరుక్కుంటున్నారట‌. ల‌గ‌డ‌పాటి..ఈయ‌న విజ‌య‌వాడ ఎంపీగా కంటే.. వివాదాల‌తోనే ఎక్కువ ప‌రిచ‌యం. బ‌ల‌మైన మీడియాను సైతం త‌న‌వైపు తిప్పుకునేలా చేయ‌గ‌లిగే నేర్పరి. […]

ల్యాంకోహిల్స్ కోస‌మే టీడీపీలోకి?
X

విజ‌య‌వాడ మాజీ ఎంపీ ల‌గ‌డ‌పాటి రాజ‌గోపాల్ టీడీపీలో చేరిక‌ దాదాపు ఖ‌రారైంది. ఇందుకు సంబంధించిన డీల్ కూడా కుదిరింద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఆయ‌నకున్న అంగ అర్ధ‌బ‌లానికి ఇప్ప‌టికిప్పుడు బీజేపీలో చేర‌గ‌ల‌డు. టీడీపీలోనే ఎందుకు చేరుతున్నాడ‌న్న ఆస‌క్తిక‌ర చ‌ర్చ ఇప్పుడు విజ‌య‌వాడ అంతా న‌డుస్తోంది. దీనికి అంత‌టికీ కార‌ణం తెలంగాణ‌లోని ఆయ‌న ఆస్తులేన‌ని విజ‌య‌వాడ టీడీపీనేత‌లు చెవులు కొరుక్కుంటున్నారట‌.

ల‌గ‌డ‌పాటి..ఈయ‌న విజ‌య‌వాడ ఎంపీగా కంటే.. వివాదాల‌తోనే ఎక్కువ ప‌రిచ‌యం. బ‌ల‌మైన మీడియాను సైతం త‌న‌వైపు తిప్పుకునేలా చేయ‌గ‌లిగే నేర్పరి. అందుకే టీఆర్ ఎస్ నేత‌లు జ‌గ‌డ‌పాటి అని వెట‌కారంగా పిలుస్తుంటారు. తెలంగాణ బిల్లును పార్ల‌మెంటులో ఎలాగైనా ఆపాల‌న్న ప‌ట్టుద‌ల‌తో స్పీక‌ర్ ల‌క్ష్యంగా మిరియాల పొడి చ‌ల్లిన ఘ‌నాపాటి.. ల‌గ‌డ‌పాటి అని తెలిసిందే! దేశం యావ‌త్తూ సంచ‌ల‌నం రేపిన ఘ‌ట‌న… పార్లమెంటు చ‌రిత్ర‌లో ఒక మాయ‌ని మ‌చ్చ‌. తెలంగాణ బిల్లు పాసైతే.. తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని ఒట్టు వేసుకున్నాడు. అన్న‌ట్లుగా స‌న్యాసం ప్ర‌క‌టించి ఈసారి పోటీ చేయ‌లేదు. మ‌రి ఇప్పుడెందుకు ఒట్టు తీసి గ‌ట్టున పెడుతున్నాడంటే..??

తెలంగాణ‌లో ల‌గ‌డ‌పాటికి ల్యాంకోహిల్స్ పేరిట రూ. వంద‌ల కోట్ల‌ భారీ వెంచ‌ర్ ఉంది . దీన్ని వ‌క్ఫ్ భూముల్లో నిర్మించార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. తాజాగా తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్ప‌డింది. వ‌క్ఫ్ బోర్డు కూడా విడిపోయింది. ఇప్పుడు త‌న ఆధీనంలో ఉన్న భూముల అన్యాక్రాంతంపై తెలంగాణ వ‌క్ఫ్ బోర్డు దృష్టి సారించింది. దీనిపై ముందుగానే మేల్కొన్న ల‌గ‌డ‌పాటి.. ఎక్క‌డ త‌న ఆస్తుల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం క‌న్ను ప‌డుతుందోన‌న్న ఆందోళ‌న‌తో టీడీపీలో చేరుతున్నార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం భావిస్తున్నారు. బీజేపీ కంటే తెలంగాణ‌లో టీడీపీకి బ‌ల‌మెక్కువ‌. పైగా దానికి మీడియా స‌పోర్టు ఎక్కువ‌. భ‌విష్య‌త్తులో బీజేపీ టీ ఆర్ ఎస్ బంధం మ‌రింత బ‌ల‌ప‌డే అవ‌కాశాలు లేక‌పోలేదు. పైగా బీజేపీ జాతీయ పార్టీ. ఇప్ప‌టికిప్పుడు చేరినా కావూరి, పురందేశ్వ‌రి త‌దితరుల‌తో నెగ్గుకురావ‌డం క‌ష్టం. అదే టీడీపీలో చేరితో ఆంధ్ర వారి ఆస్తులపై దాడి, సెక్ష‌న్‌-8 అంటూ కావాల్సినంత మీడియా మైలేజీ పొంద‌వ‌చ్చు. అందుకే ల‌గ‌డ‌పాటి టీడీపీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారు అని టీడీపీ నేత‌లే చ‌ర్చించుకుంటున్నారు.

First Published:  20 Oct 2015 4:47 AM GMT
Next Story