భారత్‌పై ప్రయోగించేందుకే అణు ఆయుధాలు

పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి చౌదరి ఐజాజ్ సంచలన ప్రకటన చేశారు. భారత్‌పై ప్రయోగించేందుకే తాను అణు ఆయుధాలు సిద్ధం చేసినట్టు చెప్పారు. యుద్ధం వస్తే భారత్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంనేందుకే చిన్నపాటి అణ్వాయుధాలను అభివృద్ధి చేశామని స్పష్టం చేశారు. భారత్‌ ఇప్పటికే వ్యూహాత్వకంగా అణుఆయుధాలు సిద్ధం చేసిందని… అందుకే తాము కూడా ఆయుధాలు సిద్ధం చేశామన్నారు. అణు అయుధాల తయారీపై పాక్ ప్రభుత్వం తరపున ఈ స్థాయి వ్యక్తి ప్రకటన చేయడం ఇదే తొలిసారి.

 భారత్‌ను మరింత రెచ్చగొట్టేందుకే పాక్ విదేశాంగ కార్యదర్శి ఈ ప్రకటన చేశారని భావిస్తున్నారు. చౌదరి ఐజాజ్ మంగళవారం ఈ ప్రకటన చేశారు. భారత్‌ యుద్ధానికి సిద్ధపడితే తాము ఏకంగా అణుఆయుధాలు ప్రయోగిస్తామన్న భావన కలిగించేందుకు ఐజాజ్‌ ఈ ప్రకటన చేశారని అంచనా వేస్తున్నారు.