Telugu Global
Others

ఫిల్మ్‌సిటీకి బాబు పరుగు అందుకేనా..?

అవసరం మనదైనప్పుడు అణిగిమణిగే ఉండాలంటారు పెద్దలు. ఈ విషయం ఏపీ సీఎం చంద్రబాబుకు అర్థమైనంతగా బహుశా ఎవరికీ అర్థమై ఉండదు. అవసరం, అణిగిమణిగి ఉండడం అనే సిద్ధాంతంతోనే చంద్రబాబు ఎన్నో గండాల నుంచి గట్టెక్కారు. ఓటుకు నోటు కేసులోనూ ఈ సూత్రాన్ని మోదీ వద్ద సమర్థవంతంగా ప్రయోగించారని చెబుతుంటారు. అందుకు ఆడియో, వీడియో టేపులున్నా దేశంలోని ఏ వ్యవస్థా ఏమీ చేయలేకపోయింది. తాజాగా… టీడీపీ నేతలు చెప్పే ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి అమరావతి శంకుస్థాపనకు రామోజీరావును ఆహ్వానించేందుకు […]

ఫిల్మ్‌సిటీకి బాబు పరుగు అందుకేనా..?
X

అవసరం మనదైనప్పుడు అణిగిమణిగే ఉండాలంటారు పెద్దలు. ఈ విషయం ఏపీ సీఎం చంద్రబాబుకు అర్థమైనంతగా బహుశా ఎవరికీ అర్థమై ఉండదు. అవసరం, అణిగిమణిగి ఉండడం అనే సిద్ధాంతంతోనే చంద్రబాబు ఎన్నో గండాల నుంచి గట్టెక్కారు. ఓటుకు నోటు కేసులోనూ ఈ సూత్రాన్ని మోదీ వద్ద సమర్థవంతంగా ప్రయోగించారని చెబుతుంటారు. అందుకు ఆడియో, వీడియో టేపులున్నా దేశంలోని ఏ వ్యవస్థా ఏమీ చేయలేకపోయింది. తాజాగా… టీడీపీ నేతలు చెప్పే ప్రొటోకాల్‌ను పక్కన పెట్టి అమరావతి శంకుస్థాపనకు రామోజీరావును ఆహ్వానించేందుకు నేరుగా హెలికాప్టర్ వేసుకుని ఫీల్మ్‌సిటీలో వాలిపోయారు బాబు. అయితే పేరుకు అమరావతి ఆహ్వానం అయినా అసలుకారణాలు చాలా ఉన్నాయని పొలిటికల్ టాక్.

ఎన్నికలు ముగిశాక రామోజీరావును చంద్రబాబు లైట్ తీసుకున్నారన్న ప్రచారం ఉంది. తనను కాదని రామోజీరావు ఎక్కడికి వెళ్లలేరన్న ధీమాతోనే చంద్రబాబు అలా వ్యవహరించారని చెబుతుంటారు. వైరిపక్షమైన జగన్ బలపడితే తన కన్నా రామోజీరావుకే ఎక్కువ ప్రమాదమని, కాబట్టి మరో ఆలోచన లేకుండా తనను సమర్థిస్తారని ఏపీ సీఎం భావించారు. అయితే చంద్రబాబే కాదు రాష్ట్రంలో ఎవరూ ఊహించని విధంగా జగన్, రామోజీరావులు ఫిల్మ్ సిటీలో ఏకాంత చర్చలు జరపడంతో చంద్రబాబు ఉలిక్కిపడ్డారు.

దాదాపు రెండు గంటల పాటు రామోజీ, జగన్‌ల మధ్య చర్చలు జరగడంతో బాబు ఆలోచనలో పడ్డారని సమాచారం. దీనికి తోడు ఇటీవల ఈనాడు పత్రిక నిత్యం కాకున్నా వారంలో ఓ రెండు రోజుల పాటు టీడీపీ ప్రభుత్వ విధానాలకు, ఏపీలో జరుగుతున్న అక్రమాలకు వ్యతిరేకంగా కథనాలు రాస్తోంది. జగన్‌తో చర్చలు, పత్రికలో వ్యతిరేక కథనాలతో చంద్రబాబు కలవరపడ్డారని టీడీపీ నేతలు ప్రైవేట్ సంభాషణల్లో చెప్పుకుంటున్నారు. అందుకే రామోజీరావుతో గ్యాప్‌ లేకుండా చేసుకోవడంలో భాగంగానే చంద్రబాబు నేరుగా ఫిల్మ్ సిటికి వెళ్లారని చెబుతున్నారు.

రామోజీరావు ”ఇగో” దెబ్బతింటే మొదటికే మోసం వస్తుందన్న విషయం చంద్రబాబుకు బాగా తెలుసంటున్నారు. గతంలో ఎన్టీఆర్ పదవి పొగొట్టుకోవడానికి చంద్రబాబు కన్నా రామోజీ తన పత్రిక ద్వారా వేసిన ఎత్తులే శక్తివంతంగా పనిచేశాయి. పైగా టీడీపీని సొంతం చేసుకునే ఒక సామాజికవర్గానికి ఈనాడు పత్రిక ఓ భగవద్గీతే. అలాంటి పత్రికలో వ్యతిరేకంగా కథనాలు వస్తే చంద్రబాబు నాయకత్వానికే ఎసరు రావచ్చు. అందుకే జగన్, పవన్ కల్యాణ్‌లను శంకుస్థాపనకు ఆహ్వానించే విషయంలో అడ్డొచ్చిన ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి రామోజీ వద్దకు స్వయంగా చంద్రబాబు వెళ్లారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

First Published:  20 Oct 2015 1:45 AM GMT
Next Story