Telugu Global
Others

రైతుల బట్టల్లోనూ నొక్కుడు

రాజధాని కోసం భూములిచ్చిన రైతుల భవిష్యత్తు బంగారం చేస్తామని చంద్రబాబు చెబుతూ వచ్చారు. భవిష్యత్తు ఏమో గానీ అక్కడి రైతులకు శంకుస్థాపన సమయంలోనే ప్రభుత్వం అవమానించింది. అడుక్కునే వారిని ట్రీట్ చేసినట్టు చేసింది. దీంతో ఇప్పుడు రాజధాని రైతులు రగిలిపోతున్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు శంకుస్థాపన సందర్భంగా పట్టుబట్టలు పెడుతామని ఇటీవల చంద్రబాబు చెప్పారు. అన్నట్టుగానే అందుకు రంగం సిద్ధం చేశారు. కోట్ల విలువైన, మూడు పంటలు పండే భూములను దారదత్తం చేశారు కాబట్టి ఖరీదైన […]

రైతుల బట్టల్లోనూ నొక్కుడు
X

రాజధాని కోసం భూములిచ్చిన రైతుల భవిష్యత్తు బంగారం చేస్తామని చంద్రబాబు చెబుతూ వచ్చారు. భవిష్యత్తు ఏమో గానీ అక్కడి రైతులకు శంకుస్థాపన సమయంలోనే ప్రభుత్వం అవమానించింది. అడుక్కునే వారిని ట్రీట్ చేసినట్టు చేసింది. దీంతో ఇప్పుడు రాజధాని రైతులు రగిలిపోతున్నారు.

రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు శంకుస్థాపన సందర్భంగా పట్టుబట్టలు పెడుతామని ఇటీవల చంద్రబాబు చెప్పారు. అన్నట్టుగానే అందుకు రంగం సిద్ధం చేశారు. కోట్ల విలువైన, మూడు పంటలు పండే భూములను దారదత్తం చేశారు కాబట్టి ఖరీదైన దుస్తులే పెడుతారని అందరూ అనుకున్నారు. కానీ బట్టలు అందుకున్నాక గానీ తెలియలేదు అక్కడి రైతులకు. ప్రభుత్వం తమను ఎంతగా అవమానించిందో.

కుటుంబానికి ఒక చీర, ధోవతి, పసుపు, కుంకుమ, స్వీట్ ప్యాకెట్ ఇవ్వాలని నిర్ణయించగా… బట్టలు సరఫరా చేసే బాధ్యతను అప్కోకు అప్పగించారు. స్వీట్ ప్యాకెట్ సరఫరాను తన అనుకూలమైనవారికి అప్పగించారు. అప్కో ద్వారా సేకరించి ఇచ్చిన దుస్తులు చూశాక అక్కడి రైతులకు మండుకొచ్చింది. చీరకు చెంగు లేదు… పంచెకు అంచు లేదు. దీంతో రైతులు షాకయ్యారు. వెంటనే తీసుకెళ్లి సీఆర్‌డీఏ కార్యక్రమంలో అధికారుల మొహన కొట్టారు. తామేమి బట్టలు లేకుండా తిరగడం లేదని… ఇలాంటి చెత్త బట్టలు తమకెందుకని మండిపడ్డారు. స్వీట్లు కూడా షాపుల్లో పేరుకుపోయిన పాత సరుకును తెచ్చి చేతలు దులుపుకున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

ఈ తతంగం వెనుక తెలుగు తమ్ముళ్లకు బాగానే గిట్టుబాటు అయిందని చెబుతున్నారు. బట్టల కోసమే దాదాపు రూ.5 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. కుటుంబానికి రూ. 2,400 విలువైన బట్టలు ఇస్తామని చెప్పింది. అయితే అప్కో ద్వారా వాటిని 16వందల చొప్పున కొనుగోలు చేశారు. దాదాపు 29 గ్రామాల్లో వీటిని పంపిణీ చేయాల్సి ఉంది. అయితే చీర, ధోవతిని పరిశీలించిన మహిళలు వీటికి 16 వందలు ఎందుకు … చీర నాలుగు వందలు, పంచె రెండు వందల రూపాయలకు మించి ఉండదని తేల్చేస్తున్నారు. అంటే ఈ లెక్కన తెలుగు తమ్ముళ్లకు ఏ స్థాయిలో గిట్టుబాటు అయిందో అర్థం చేసుకోవచ్చంటున్నారు.

తాము అడక్కపోయినా బట్టలు పెడుతామంటూ ముందుకొచ్చి తీరా ఇలా అవమానించడంపై రైతు కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మునుముందు తమను ప్రభుత్వం ఎలా చూస్తుందో అర్థం కావడం లేదంటున్నారు.

First Published:  21 Oct 2015 1:34 AM GMT
Next Story