Telugu Global
Others

తెలుగు తమ్ముళ్ల దొంగ సైకిల్ ర్యాలీ

మన మట్టి -మన నీరు పేరుతో ఏపీ ప్రజల్లో రాజధాని స్పూర్తి రగిల్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుంటే … ఉడతా భక్తిగా కొందరు తెలుగు తమ్ముళ్లు కూడా రెడీ అయ్యారు. సైకిల్ యాత్రతో జనంలో స్పూర్తిని లావాలా రాజేస్తామంటూ టీడీపీ ఐటీ విభాగానికి చెందిన కొందరు యూత్ రంగంలోకి దూకారు. క్రికెట్‌లో ఫాస్ట్ బౌలర్‌ను ఎదుర్కొనేందుకు సిద్దమైనట్టు హెల్మెట్లు, పై నుంచి కింద వరకు గార్డులు కట్టుకుని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్దకు సైకిళ్లపై  చేరుకున్నారు. కాసేపు కాళ్లు […]

తెలుగు తమ్ముళ్ల దొంగ సైకిల్ ర్యాలీ
X

మన మట్టి -మన నీరు పేరుతో ఏపీ ప్రజల్లో రాజధాని స్పూర్తి రగిల్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తుంటే … ఉడతా భక్తిగా కొందరు తెలుగు తమ్ముళ్లు కూడా రెడీ అయ్యారు. సైకిల్ యాత్రతో జనంలో స్పూర్తిని లావాలా రాజేస్తామంటూ టీడీపీ ఐటీ విభాగానికి చెందిన కొందరు యూత్ రంగంలోకి దూకారు. క్రికెట్‌లో ఫాస్ట్ బౌలర్‌ను ఎదుర్కొనేందుకు సిద్దమైనట్టు హెల్మెట్లు, పై నుంచి కింద వరకు గార్డులు కట్టుకుని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వద్దకు సైకిళ్లపై చేరుకున్నారు. కాసేపు కాళ్లు చేతులు అటుఇటు తిప్పుతూ వామప్ చేశారు.

వీరి యాత్రను టీడీపీ సీనియర్ నేతలు జెండా ఊపి ప్రారంభించారు. అంతే సాయంత్రానికి కల్లా అమరావతి చేరుకుంటారేమో అనిపించేలా సర్రున దూసుకెళ్లారు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ హైదరాబాద్ బయటకు వెళ్లగానే తెలుగు తమ్ముళ్లు ప్లాన్ బీని బయటకు తీశారు. అప్పటికే అక్కడ సిద్ధం చేసిన లారీలోకి సైకిళ్లను పడేశారు. ఏసీ బస్సులోకి తమ్ముళ్లు ఎక్కిపోయారు.

మధ్యలో ఏదైనా ఊరు వచ్చినప్పుడు మాత్రం వెంటనే దిగేసి సైకిళ్లు లారీ నుంచి కిందకు దింపి రైడ్ మొదలుపెట్టారు. ఇలా ఊరు దాటగానే ఏసీ బస్సు ఎక్కడం… ఊరు రాగానే సైకిల్ ఎక్కడం. ఆ విధంగా తెలుగు తమ్ముళ్లు ముందుకెళ్లారు. అయితే కొన్ని టీవీ చానళ్లు ఈ తంతును పసిగట్టడంతో ఐటీ తెలుగు తముళ్ల టైర్లలో గాలి పోయింది. టీడీపీ నేతలు కూడా ఈ ఘటనపై సీరియస్ అయ్యారు. అసలు చేతగానప్పుడు సైకిల్ యాత్ర ఎవరు చేయమన్నారని తెలుగు తమ్ముళ్లపై మండిపడ్డారు. ఇలాంటి చీప్ ట్రిక్స్‌తో పార్టీ పరువు తీస్తున్నారని రుసరుసలాడుతున్నారు.

First Published:  20 Oct 2015 1:17 PM GMT
Next Story