Telugu Global
Cinema & Entertainment

కంచె చిత్రం రివ్యూ

Rating:  3/5 గాలి కి  వ్య‌తిరేకంగా  వెళ్లాలి అంటే చాల శ‌క్తి కావాలి.  ఎన‌ర్జీ కేవ‌లం శారీర‌కంగానే కాదు  మాన‌సీకంగా కావాలి.  అటువంటి  ఎన‌ర్జీ వున్న  ద‌ర్శ‌కుడు క్రిష్. త‌న మొద‌టి సినిమా క్రిష్ తోనే త‌ను ఎటువంటి ద‌ర్శ‌కుడు అనేది   చాటుకున్నాడు .  కొంత సందేశాం.. బ్రేక్ ది రూల్స్  కాన్సెప్ట్ తో   సినిమాలు త‌ను చేయ‌గ‌ల‌న‌ని నిరూపించుకున్నాడు.   తాజాగా     కంచే చిత్రం  పేరు తో  మ‌రో  సాహాసం చేశాడు. వ‌రుణ్ తేజ్  ను రెండో […]

కంచె చిత్రం రివ్యూ
X

Rating: 3/5

గాలి కి వ్య‌తిరేకంగా వెళ్లాలి అంటే చాల శ‌క్తి కావాలి. ఎన‌ర్జీ కేవ‌లం శారీర‌కంగానే కాదు మాన‌సీకంగా కావాలి. అటువంటి ఎన‌ర్జీ వున్న ద‌ర్శ‌కుడు క్రిష్. త‌న మొద‌టి సినిమా క్రిష్ తోనే త‌ను ఎటువంటి ద‌ర్శ‌కుడు అనేది చాటుకున్నాడు . కొంత సందేశాం.. బ్రేక్ ది రూల్స్ కాన్సెప్ట్ తో సినిమాలు త‌ను చేయ‌గ‌ల‌న‌ని నిరూపించుకున్నాడు. తాజాగా కంచే చిత్రం పేరు తో మ‌రో సాహాసం చేశాడు. వ‌రుణ్ తేజ్ ను రెండో సినిమాకే ఒక వైవిధ్య‌మైన చిత్రం చేయించాడు. మ‌రి కొద్ది పాటి అంచ‌నాల‌తో వ‌చ్చిన కంచె చిత్రం అభిమానుల్ని ఏం చేసింది అనేది చూద్దాం…
కథ :
‘కంచె’ సినిమా రెండు టైం జోన్స్ లో నడుస్తుంది.. ఒకటి 1936.. మరొకటి 1944.. ఇక అసలు కథలోకి వెళితే.. 1936లో.. ఒకే ఊరికి చెందిన ధూపాటి హరిబాబు(వరుణ్ తేజ్) – రాచకొండ సీతాదేవి(ప్రాగి జైశ్వాల్)లు మద్రాసు యూనివర్సిటీలో చదువుకుంటూ ఉంటారు. కానీ సీతాదేవి రాచకొండ జమిందారి వంశంలో జన్మించిన ప్రిన్సెస్.. హరిబాబు మంగలి ఫ్యామిలీలో పుట్టిన కుర్రాడు. యూనివర్సిటీలో పరిచయం అయిన వీరిద్దరూ ప్రేమికులుగా మారతారు. కానీ వీరి ప్రేమని రాచకొండ సంస్థానం అధినేత, సీతాదేవి అన్న అయిన ఈశ్వర్ ప్రసాద్(నికేతన్ ధీర్) అంగీకరించడు. దాంతో ఆ ఊర్లో కులాల మధ్య చిచ్చు మొదలవుతుంది. ఆ చిచ్చుని హరిబాబు ఎలా చల్లార్చాడు.? తన ప్రేమని దక్కించుకున్నాడా లేదా అన్నది మెయిన్ పాయింట్.

ఇక 1944 కథకి వస్తే.. రాయల్ ఇండియన్ ఆర్మీ కల్నల్ ఈశ్వర్ ప్రసాద్ మరియు మేజర్ ధూపాటి హరిబాబులు వరల్డ్ వార్ లో ఇటలీ తరపున జర్మనీతో పోరాడటానికి యుద్ధంలోకి దిగుతారు. ఒక్కసారిగా జర్మనీ దళాలు వీరి స్థావరం మీద దాడి చేసి అందరు సైనికులను చంపి ఆ ఆర్మీ చీఫ్ కెప్టెన్ మరియు కల్నల్ ఈశ్వర్ ప్రసాద్ లను బందిస్తారు. జర్మన్ అటాక్ నుంచి వరుణ్ తేజ్, అతనితో పాటు మరో నలుగురు తప్పించుకుంటారు. ఆ ఐదు మంది కలిసి వెళ్లి తమ కెప్టెన్ మరియు కల్నల్ ని ఎలా కాపాడారు.? వారిని కాపాడే క్రమంలో హరిబాబు వ్యూహం ఏమిటి.? అలాగే ఈ జర్నీలో ఆ టీం ఎదుర్కున్న ఇబ్బందులేమిటి.? చివరికి ఆ యుద్ద భూమి నుంచి ఎవరెవరు భయటపడ్డారు.? అన్నది మీరు వెండితెరపైనే చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్ :
రెండవ సినిమాకే వరుణ్ తేజ్ కి ఇలాంటి ఓ వైవిధ్యమైన పాత్రని చేసే అవకాశం రావడం లక్ అని చెప్పాలి. ధూపాటి హరిబాబుగా వరుణ్ ది బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చాడు. అలాగే తన వాయిస్ లో, డైలాగ్ డెలివరీలో చాలా మెచ్యూరిటీ చూపించాడు. ప్రాగ్య జైశ్వాల్ రియల్ ప్రిన్సెస్ అంటే ఇలానే ఉంటుందేమో అనేలా ఉంది. యువత మాత్రం ఈ ప్రిన్సెస్ మాయలో పడిపోతారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అలాగే తన పెర్ఫార్మన్స్, క్యూట్ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ చాలా బాగున్నాయి. నికేతన్ దీర్ కూడా తన పాత్రలో నెగటివ్ షేడ్స్ ని బాగా చూపించాడు. అవసరాల శ్రీనివాస్ ఒక భయస్తుడైన సైనికుడుగా ప్రేక్షకులను బాగా నవ్విస్తాడు. తన చుట్టూ జరుగుతున్న సందర్భాలను వివరిస్తూనే కామెడీని పండించడం చాలా బాగుంది. గొల్లపూడి మారుతీ రావు, సింగీతం శ్రీనివాసరావు లాంటి వారు తమ పాత్రలకు న్యాయం చేసారు.

ఇక విజువల్స్ పరంగా కంచె మీకో డిఫరెంట్ ఫీల్ ని కలుగజేస్తుంది. అలాగే ఈ సినిమా కోసం ప్రతి చిన్న విషయాన్ని చాలా రియలిస్టిక్ గా చూపించడానికి ట్రై చేసారు. అది చూసే ఆడియన్స్ కి మనం నిజంగా అక్కడే ఉన్నాం అనే ఫీలింగ్ ని కలిగిస్తుంది.

మైనస్ పాయింట్స్ :
కంచె సినిమాకి మైనస్ పాయింట్స్ అంటే ముందుగా నేరేషన్ గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే సినిమా మొదలైనప్పటి నుంచీ యావరేజ్ స్పీడ్ లో వెళ్తూ ఉంటుంది. అక్కడక్కడా ఆ యావరేజ్ స్పీడ్ కూడా తగ్గుతూ మళ్ళీ యదా స్థానానికి వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే యావరేజ్ స్పీడ్ కూడా తగ్గుతుందో అప్పుడు సినిమా బోరింగ్ గా మారుతుంది. మొదటి అర్ధభాగంలో మొదటి 30 నిమిషాల తర్వాత ఓ 20 నిమిషాలు కథ స్లోగా సాగుతుంది. అలాగే సెకండాఫ్ స్టార్టింగ్ కూడా చాలా స్లోగా ఉంటుంది. అప్పటికే స్లోగా ఉంది అనుకుంటుంటే అప్పుడు ఓ రొమాంటిక్ డ్యూయెట్ వచ్చి సినిమాని మరింత స్లో చేసేస్తుంది. ఆ పాటని తీసేస్తే సెకండాఫ్ ఇంకాస్త బెటర్ ఫీల్ ఉంటుంది.

సాంకేతిక విభాగం :
సాంకేతిక విభాగంలో కంచెకి దాదాపు అన్ని విభాగాలు వెన్ను దన్నుగా నిలిచాయనే చెప్పాలి.. ముందుగా 1936-44 ఫీల్ వచ్చేలా ఆర్ట్ డైరెక్టర్ సాహి డిజైన్ చేసిన సెట్స్ సింప్లీ సూపర్బ్.. సినిమా చూస్తున్నప్పుడు ఆ సెట్స్ మనల్ని 1936 టైంకి తీసుకెళ్తాయి. ఆ సెట్స్ ని, అలాగే ప్రతి విజువల్ సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ చాలా బాగా షూట్ చేసాడు. ప్రతి విజువల్ ని చాలా కలర్ ఫుల్ గా చూపించాడు. ముఖ్యంగా వరల్డ్ వార్ బ్యాక్ డ్రాప్ ఎపిసోడ్స్ ని షూట్ చేసిన విధానం హాలీవుడ్ సినిమా ఫీల్ ని తెస్తుంది. ఈ విజువల్స్ కి చిరంతన్ భట్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. చాలా ఎమోషనల్,సీరియస్ సీన్స్ లో అతని మ్యూజిక్ చాలా పెద్ద హెల్ప్ అయ్యింది. సూరజ్ – రామకృష్ణ కలిసి చేసిన ఎడిటింగ్ ఇంకాస్త బెటర్ గా ఇంకాస్త స్పీడ్ గా ఉండాల్సింది. అనవసరపు సీన్స్ మరియు సెకండాఫ్ లో వచ్చే పాటని కట్ చేసి ఉండాల్సింది. వెంకట్ అండ్ డేవిడ్ కలిసి కంపోజ్ చేసిన యాక్షన్ ఎపిసోడ్స్ చాలా బాగున్నాయి. ఇక సాయి మాధవ్ బుర్ర రాసిన డైలాగ్స్ వావ్ అనేలా ఉండడమే కాకుండా మనల్ని ఆలోచించేలా చేస్తాయి.

ఇక ఈ సినిమాకి కెప్టెన్ గా నిలిచిన క్రిష్ గురించి చెప్పాలంటే క్రిష్ రాసుకున్న కథ అందుకోసం ఎంచుకున్న నేపధ్యం బాగుంది. కథ మొదట్లో ఉన్నంత గ్రిప్పింగ్ కథ చివర్లో లేకపోవడం ఆయన చేసిన మిస్టేక్.. ఎందుకంటే చివర్లో వచ్చే ఫీల్ తోనే ఆడియన్స్ బయటకి వస్తారు. కావున క్లైమాక్స్ ని ఇంకాస్త స్ట్రాంగ్ గా రాసుకొని ఉండాల్సింది. ఓవరాల్ గా క్రిష్ ఇలాంటి ప్రాజెక్ట్ ని అటెంప్ట్ చేసినందుకు మా తరపున సాల్యూట్ తు క్రిష్. మినిమమ్ బడ్జెట్ అయినప్పటికీ విజువల్ ఎఫెక్ట్స్ ని చాలా బాగా చూపించారు. ఇక రాజీవ్ రెడ్డి – సాయి బాబుల నిర్మాణ విలువలు బాగున్నాయి.

తీర్పు :
ఈ సినిమా మల్టీ ప్లెక్స్, ఎ సెంటర్ ఆడియన్స్ కి బాగా నచ్చేస్తుంది, కానీ బి,సి సెంటర్ ఆడియన్స్ కి అంట పెద్దగా నచ్చకపోవచ్చు. ఓవరాల్ గా కంచె సినిమా టాలీవుడ్ సినిమా స్థాయిని పెంచే సినిమా, ప్రతి ఒక్కరికీ పర్సనల్ గా బాగా నచ్చే సినిమా, అలాగే ప్రతి ఒక్కరూ ఈ దసరాకి ఒకసారి చూడదగిన సినిమా. చివరిగా ‘కంచె’ సినిమా ద్వారా క్రిష్ సినిమా ద్వారా చెప్పాలనుకున్న మాట ‘మనుషులు కలిసి బతకాలి రా.. కంచెలు వేసుకొని కాదు’.అని చెప్పిన సందేశం బావుంటుంది. కుల ప్రాతిపాతికిన న‌డుస్తున్న భార‌తీయ స‌మాజంలో కులాల ప‌ట్ల ఒక వ‌ర్గం మీడియా , సాహిత్యం, అతి దారుణంగా వుంటుంది. అయితే ఈ చిత్రంలో కులం అనేది ఒక గుర్తింపు మాత్ర‌మే.. మ‌నిషి ప్ర‌తిభ‌ను అంచ‌న వేయ‌డానికి ..ఇత‌రత్ర జీవించ‌డానికి కులం , లేదా ఇత‌ర అంశాలు కంచెలా అడ్డు కాకూడ‌ద‌నే ఉద్దేశ్యం ద‌ర్శ‌కుడి యెక్క ఉన్న‌త ఆలోచ‌న స్థితికి అద్దం ప‌డుతుంది. ఓవరాల్ గా కంచె అంద‌రు ఒక సారి చూసి తీరాల్సిన చిత్రం .

First Published:  22 Oct 2015 8:05 AM GMT
Next Story