Telugu Global
Others

తేల్చేసిన మోదీ-ఏపీకి మొండి చేయి

అమరావతి శంకుస్థాపన సందర్భగా మాట వరుసకైనా వరాల జల్లు కురిపిస్తారని భావించిన వారికి ప్రధాని మోదీ షాక్ ఇచ్చారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేస్తామని చెప్పడం మినహా.. ఒక్క వరాన్ని కూడా ఇవ్వలేదు. ఓవరాల్‌గా గతంలో ఇచ్చిన హామీల అమలుకు హామీ ఇచ్చారు మోదీ.  ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ ఊసే లేదు. తెలుగులో ప్రసంగాన్ని ఆరంభించిన ప్రధాని మోదీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అన్ని హంగులతో అమరావతి ప్రజారాజధాని అవుతుందని ఆశాభావం వ్యక్తం […]

తేల్చేసిన మోదీ-ఏపీకి మొండి చేయి
X

అమరావతి శంకుస్థాపన సందర్భగా మాట వరుసకైనా వరాల జల్లు కురిపిస్తారని భావించిన వారికి ప్రధాని మోదీ షాక్ ఇచ్చారు. విభజన చట్టంలోని హామీలను అమలు చేస్తామని చెప్పడం మినహా.. ఒక్క వరాన్ని కూడా ఇవ్వలేదు. ఓవరాల్‌గా గతంలో ఇచ్చిన హామీల అమలుకు హామీ ఇచ్చారు మోదీ. ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్ ఊసే లేదు.

తెలుగులో ప్రసంగాన్ని ఆరంభించిన ప్రధాని మోదీ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. అన్ని హంగులతో అమరావతి ప్రజారాజధాని అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ప్రపంచంలో ఉన్న అత్యుత్తమ పద్ధతులను క్రోడీకరించి… అద్భుత రాజధానికి చంద్రబాబు శ్రీకారం చుట్టారని పొడిగేశారు. కేసీఆర్‌ ఇంటికి వెళ్లి ఆహ్వానించినందుకు చంద్రబాబును అభినందించారు. రాజకీయ కారణాలతో జరిగిన రాష్ట్ర విభజనకు అమాయకులు బలయ్యారని ఆవేదక వ్యక్తం చేశారు. తెలంగాణ, ఆంధ్ర కలిసి పనిచేస్తే అద్భుతమైన అభివృద్ధి సాధ్యమన్నారు. అమరావతి కోసం తానుకూడా పార్లమెంట్ మట్టిని, యమున నీరును తెచ్చానని చెప్పారు.

ఇలా మొత్తం పొడగ్తలు, సెంటిమెంట్ల చూట్టే ప్రసంగాన్ని సాగించిన మోదీ కొత్తగా ఏపీకి ఒక్కటంటే ఒక్క హామీ కూడా ఇవ్వలేదు. ప్రసంగం చివరలో వరాల జల్లు కురుస్తుందని చంద్రబాబుతో సహా కార్యక్రమానికి హాజరైన జనం, కోట్లాది మంది టీవీల ముందు ఎదురు చూస్తుండగానే ఎలాంటి వరాలు ఇవ్వకుండానే ప్రసంగాన్ని ముగించారు. కనీసం మాట వరుసకైన ఏపీకి కేంద్రం చేసే సాయంపై మోదీ ఒక్కమాట కూడా మాట్లాకపోవడంతో అందరూ షాక్ అయ్యారు. అప్పటి వరకు ఆనందంగా కనిపించిన చంద్రబాబు కూడా డీలా పడిపోయారు. పార్లమెంట్‌ నుంచి మట్టి, యమున నుంచి నీరు తీసుకొచ్చి ఇవ్వడం తప్ప ఏపీకి మోదీ ఏమీ ఇవ్వలేదు. సో కేంద్రం నుంచి ఏపీకి సాయం ఇక భ్రమేనని మరోసారి నిర్ధారణ అయింది.

First Published:  22 Oct 2015 3:36 AM GMT
Next Story