వైసీపీకి చాన్స్ దొరికింది.. ఆందోళనకు పిలుపు

అమరావతి శంకుస్థానకు వచ్చిన ప్రధాని మోదీ ఏపీ నోట్లో మట్టి కొట్టి వెళ్లడంపై వైసీపీ తీవ్రంగా స్పందించింది.ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజ్‌పై ప్రధాని ప్రకటన చేయకపోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పార్టీ అధ్యక్షుడు జగన్‌ పిలుపునిచ్చారు.

ప్రత్యేక హోదాపై ప్రధాని ప్రకటన చేయకపోవడం ఆంధ్ర ప్రజలను, యువతను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. పార్లమెంట్‌ నుంచి మట్టి, యమున నుంచి నీరు తెచ్చిన మోదీ ప్రత్యేక హోదాపై మాత్రం నోరు మెదపలేని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రధాని పక్కన పెట్టారని జగన్ విమర్శించారు. ప్రత్యేక హోదా వచ్చే వరకు కలిసికట్టుగా పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.