Telugu Global
Cinema & Entertainment

బాల‌య్య టీజ‌ర్ అదిరింది

కొందిరితో సినిమా అంటే  ద‌ర్శ‌కుల‌కు  ఒకింత రిస్కే. అభిమానుల‌కు  న‌చ్చిన విధంగా సినిమా ఉండాలి.  త‌మ అభిమాన హీరో చిత్రం  హిట్ అవ్వ‌క పోతే.. ఫ్యాన్స్ నుంచి సోష‌ల్ నెట్ వర్క్ లో ఏ విధ‌మైన  వార్నింగ్స్ ..తిట్ల దండ‌కాలు వ‌స్తాయో  ఊహించ‌డం క‌ష్టం.  ద‌ర్శ‌కుడు  శ్రీ వాస్ బాల‌య్య తో   డిక్టేట‌ర్ చిత్రం  చేస్తున్న విషయం తెలిసిందే.  లెజెండ్ చిత్రం  ఘ‌న విజ‌యం సాధించింది.  ఆ త‌రువాత  కొత్త ద‌ర్శ‌కుడు జ‌య‌దేవ్ తో చేసిన  ల‌య‌న్ […]

బాల‌య్య టీజ‌ర్ అదిరింది
X

కొందిరితో సినిమా అంటే ద‌ర్శ‌కుల‌కు ఒకింత రిస్కే. అభిమానుల‌కు న‌చ్చిన విధంగా సినిమా ఉండాలి. త‌మ అభిమాన హీరో చిత్రం హిట్ అవ్వ‌క పోతే.. ఫ్యాన్స్ నుంచి సోష‌ల్ నెట్ వర్క్ లో ఏ విధ‌మైన వార్నింగ్స్ ..తిట్ల దండ‌కాలు వ‌స్తాయో ఊహించ‌డం క‌ష్టం. ద‌ర్శ‌కుడు శ్రీ వాస్ బాల‌య్య తో డిక్టేట‌ర్ చిత్రం చేస్తున్న విషయం తెలిసిందే. లెజెండ్ చిత్రం ఘ‌న విజ‌యం సాధించింది. ఆ త‌రువాత కొత్త ద‌ర్శ‌కుడు జ‌య‌దేవ్ తో చేసిన ల‌య‌న్ చిత్రం బాక్సాఫీస్ డిజాస్ట‌ర్ అనిపించుకుంది. దీంతో ప్ర‌స్తుతం చేస్తున్న డిక్టేట‌ర్ చిత్రం పై నంద‌మూరి బాల‌య్య ఫ్యాన్స్ చాల అంచ‌నాలు పెట్టుకున్నారు.
అయితే ద‌స‌రా పండుగ సంద‌ర్బంగా రిలీజ్ చేసిన డిక్టేట‌ర్ టీజ‌ర్ సినిమా పై అంచ‌నాలు పెంచుతుంది. ముఖ్యంగా బాల‌య్య పాతికేళ్ల యువ‌కిడిగా ఉత్స‌హంగా..ఎన‌ర్జిటిక్ గా క‌నిపిస్తున్నారు. ఇదే సినిమాకు శుభ సూచ‌కంగా ఫీల్ అవుతున్నారు అభిమానులు. ఎందుకంటే ల‌య‌న్ చిత్రంలో బాల‌య్య ను దారుణంగా చూపించారు. కొన్న చోట్ల చూడ‌లేన్నంత గా కెమెరా యాంగిల్స్ పెట్టి విర‌క్తి పుట్టించారు. అయితే శ్రీ‌వాస్ మాత్రం డిక్టేట‌ర్ పేరుకు త‌గ్గ‌ట్టు ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్న‌ట్లు స్ప‌ష్టంగా టీజ‌ర్ తెలియ చేస్తుంది. సంక్రాంతి పండ‌గ కాన‌క‌గా ఈ సినిమాను రిలీజ్ చేయ‌డానికి రంగం సిద్దం చేశారు. బాల‌య్య స‌ర‌స‌న అంజ‌లి న‌టిస్తుంది. మొత్తం మీద సినిమా పై పాజిటివ్ వైబ్రేష‌న్స్ క‌లిగించింది టీజ‌ర్ మ‌రి.

First Published:  22 Oct 2015 11:53 PM GMT
Next Story