Telugu Global
Others

రాష్ట్రానికి ఏంకావాలో బాబుకు తెలియదా..?

అమరావతి శంకుస్థాపన సందర్భంగా చంద్రబాబు ప్రసంగం చాలా ఆసక్తిగా సాగింది. దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడిన చంద్రబాబు అసలు విషయం కన్నా అవసరం లేని అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు కనిపించింది. వేదికపై ప్రధాని ఉన్న వేళ రాష్ట్రానికి సాయం కోరాల్సింది పోయి ఇప్పటికే కేంద్రం చాలా సాయం చేసిందని చెప్పి ఆశ్చర్యపరిచారు. సరే ప్రధానిని కాకా పట్టడానికి కాసేపు అలా మాట్లాడారు అనుకునేందుకు వీలులేదు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం డిమాండ్ చేస్తున్న ప్రత్యేక హోదా […]

రాష్ట్రానికి ఏంకావాలో బాబుకు తెలియదా..?
X

అమరావతి శంకుస్థాపన సందర్భంగా చంద్రబాబు ప్రసంగం చాలా ఆసక్తిగా సాగింది. దాదాపు 20 నిమిషాల పాటు మాట్లాడిన చంద్రబాబు అసలు విషయం కన్నా అవసరం లేని అంశాలపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టినట్టు కనిపించింది. వేదికపై ప్రధాని ఉన్న వేళ రాష్ట్రానికి సాయం కోరాల్సింది పోయి ఇప్పటికే కేంద్రం చాలా సాయం చేసిందని చెప్పి ఆశ్చర్యపరిచారు. సరే ప్రధానిని కాకా పట్టడానికి కాసేపు అలా మాట్లాడారు అనుకునేందుకు వీలులేదు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం డిమాండ్ చేస్తున్న ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు ఎక్కడా ప్రస్తావించలేదు. పైగా పార్లమెంట్‌లో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రకటించగా.. చంద్రబాబు మాత్రం ప్రత్యేక ప్యాకేజ్‌కు కేంద్రం హామీ ఇచ్చిందంటూ వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా అన్న మాటే బాబు నోట రాలేదు.

రాజాధాని కోసం ఇప్పటికే 1850 కోట్లు ఇచ్చారని, లోటు బడ్జెట్ పూడ్చడం, మెట్రో రైలు నిర్మాణం, ఎయిర్‌పోర్టుల స్థాపనలో కేంద్రం చాలా సాయం చేసిందని బాబు పొగిడేశారు. చంద్రబాబు కాసేపు ఏపీ ముఖ్యమంత్రా లేక బీజేపీ నాయకుడా అన్న స్థాయిలో మోదీ ప్రభుత్వాన్ని పొడిగేశారు. తెలంగాణకు హైదరాబాద్ , కర్నాటకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై ఉందని తమకే ఆదాయం వచ్చే నగరం లేదని అన్నారు. కాబట్టి కేంద్రం అండగా నిలవాలని ఓ మాట అడ్డుగా వేశారు.

దాదాపు 20 నిమిషాల పాటు సాగిన ప్రసంగంలో ఐదు నిమిషాల పాటు మన పుట్ట మట్టి- మన నీరు కార్యక్రమం గురించే వివరించారు. మరో రెండు నిమిషాలు ఏడు గ్రిడ్లు, ఐదు మిషన్లు అంటూ మాట్లాడారు. మరికొద్ది సేపు ముహూర్తం, అమరావతి పరిధిలో తాను హెలికాప్టర్ ద్వారా చల్లిన పవిత్ర మట్టి, నీరు, ముహూర్తం గురించి ఇంగ్లీష్‌లో మోదీకి వివరించారు. అలా చల్లిన తర్వాత ఆ నేల చాలా శక్తివంతమైందని ప్రధానితో చెప్పారు.

ఆ విధంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి దక్కాల్సిన వాటిపై కాకుండా తన కార్యక్రమాలను వివరించుకునేందుకు, మోదీని పొడిగేందుకు చంద్రబాబు ఎక్కువగా ప్రయత్నించారు. పార్లమెంట్‌ వేదికగా అప్పటి కేంద్రం ప్రత్యేకహోదాకు హామీ ఇవ్వగా చంద్రబాబు మాత్రం ప్రత్యేక హోదా అంశాన్ని వదిలేసి ప్యాకేజ్ కోసం హామీ ఇచ్చారంటూ చెప్పడం విశేషం.

First Published:  23 Oct 2015 3:26 AM GMT
Next Story