Telugu Global
Others

ప్రభుత్వ పబ్లిసిటీపై నీళ్లు చల్లిన మోదీ

నాలుగు వందల కోట్లు. కనివిని ఎరుగని రీతిలో ఖర్చు పెట్టి అమరావతి శంకుస్థాపనకు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి వారం ముందు నుంచి టీవీలు,పేపర్లలో బాగా ప్రచారం చేశారు. టీడీపీకి అనుకూల టీవీ చానళ్లతో నిరంతర కథనాలతో ఊపేశాయి. ఈవెంట్ పూర్తయిన తర్వాత కూడా మరో వారం రోజులు ప్రచారం పీక్‌లో చేసేలా టీడీపీ నేతలు, అనుకూల మీడియా ప్లాన్ చేసిందట. కార్యక్రమం ఎంత ఘనంగా నిర్వహించింది జనానికి పదేపదే గుర్తు చేయాలనుకున్నారు. కానీ తమ ఆశలపై మోదీ […]

ప్రభుత్వ పబ్లిసిటీపై నీళ్లు చల్లిన మోదీ
X

నాలుగు వందల కోట్లు. కనివిని ఎరుగని రీతిలో ఖర్చు పెట్టి అమరావతి శంకుస్థాపనకు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమానికి వారం ముందు నుంచి టీవీలు,పేపర్లలో బాగా ప్రచారం చేశారు. టీడీపీకి అనుకూల టీవీ చానళ్లతో నిరంతర కథనాలతో ఊపేశాయి. ఈవెంట్ పూర్తయిన తర్వాత కూడా మరో వారం రోజులు ప్రచారం పీక్‌లో చేసేలా టీడీపీ నేతలు, అనుకూల మీడియా ప్లాన్ చేసిందట. కార్యక్రమం ఎంత ఘనంగా నిర్వహించింది జనానికి పదేపదే గుర్తు చేయాలనుకున్నారు. కానీ తమ ఆశలపై మోదీ నీళ్లు చల్లారని టీడీపీ నేతలు బాధపడుతున్నారు .

కనీసం మాట వరుసకైనా ఏపీకి భారీ ప్యాకేజ్‌ను మోదీ ప్రకటిస్తారని అనుకున్నారు టీడీపీ నేతలు. కానీ ఒక్క రూపాయి విలువైన వాగ్దానం కూడా మోదీ నోట రాకపోవడంతో చంద్రబాబుతో పాటు మిగిలిన నేతలంతా షాక్ అయ్యారు. ఈవెంట్‌కు చేసిన ఖర్చు స్థాయిలో కూడా మోదీ నోట హామీ రాలేదే అని మధనపడుతున్నారు. ఈ పరిస్థితులో శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా చేశామంటూ ప్రచారం మొదలుపెడితే జనం చివాట్లు పెడతారని ఆందోళన చెందుతున్నారు.

కేంద్రంలో భాగస్వామ్యం ఉండి కూడా మోదీ నుంచి ఒక్క హామీ కూడా ఇప్పించలేకపోయారని… అలాంటి దానికి మళ్లీ కార్యక్రమం ఘనంగా చేశామంటూ ప్రచారం దేనికని ప్రజలు నిలదీసే పరిస్థితి రావచ్చని భావిస్తున్నారు. అందుకే కార్యక్రమం ముగిసిన తర్వాత అనుకున్న స్థాయిలో ప్రచారం రాలేదని భావిస్తున్నారు. మీడియా ఫోకస్ మొత్తం మోదీ హామీలు ఇవ్వకపోవడంపైకి మళ్లిందని ఫీలవుతున్నారు.

అదే మోదీ మాట వరుసకైనా ఓ లక్ష కోట్ల ప్యాకేజ్ ప్రకటించి ఉంటే తమ పబ్లిసిటీ ప్రతాపం చూపేవారిమని తెలుగు తమ్ముళ్లు చెప్పుకుంటున్నారు. ఎలాంటి అవాంతరాలు లేకుండా కార్యక్రమం విజయవంతమైందని సంతోషించే సమయంలోనే మోదీ తన ప్రసంగం ద్వారా తమ ఆశలను ఆవిరి చేశారని బాధపడుతున్నారు.

First Published:  23 Oct 2015 1:17 AM GMT
Next Story