Telugu Global
National

నితీష్‌ కొంప ముంచిన బాబా జోతిష్యం!

బీహార్‌ ఎన్నికల్లో తమ పార్టీ భవిష్యత్‌ తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ చేసిన ప్రయత్నం ఆయన రాజకీయ మనుగడకు ఎసరు పెట్టే పరిస్థితి తెచ్చిదంటున్నారు అక్కడున్న జనం. నిజానికి బీహార్‌ సీఎంగా నితీష్‌కు మంచి పేరుంది. ఆయనంటే అందరూ ఆదరిస్తారు. అలాంటి నితీష్‌ మోకానా నియోజకవర్గంలో ఓ బాబాను కలిశారు. ఎన్నికల్లో తమ కూటమి భవిష్యత్‌ ఎలా ఉంటుందో చెప్పమని అడిగారు. బాబా ఈ సమయంలో అనూహ్యమైన కామెంట్‌ చేశారు. అసలు ఆర్జేడీ నేత లాలూతో జట్టు కట్టడాన్ని […]

బీహార్‌ ఎన్నికల్లో తమ పార్టీ భవిష్యత్‌ తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ చేసిన ప్రయత్నం ఆయన రాజకీయ మనుగడకు ఎసరు పెట్టే పరిస్థితి తెచ్చిదంటున్నారు అక్కడున్న జనం. నిజానికి బీహార్‌ సీఎంగా నితీష్‌కు మంచి పేరుంది. ఆయనంటే అందరూ ఆదరిస్తారు. అలాంటి నితీష్‌ మోకానా నియోజకవర్గంలో ఓ బాబాను కలిశారు. ఎన్నికల్లో తమ కూటమి భవిష్యత్‌ ఎలా ఉంటుందో చెప్పమని అడిగారు. బాబా ఈ సమయంలో అనూహ్యమైన కామెంట్‌ చేశారు. అసలు ఆర్జేడీ నేత లాలూతో జట్టు కట్టడాన్ని ఆయన తప్పు పట్టారు. ఆయనకు మంచి పేరులేనప్పుడు నీవెందుకు అతనితో పయనిస్తున్నావని ప్రశ్నించారు. దీంతో నితీష్‌కు తత్వం బోధపడింది. అయితే ఆయనొక్కడే రహస్యంగా బాబాను కలిసినప్పటికీ బాబా-నితీష్‌ సంభాషణలను ఎవరో రహస్యంగా రికార్డు చేశారు. ఇది జనంలోకి వెళ్ళిపోయింది. ఆనోటా ఈనోటా లాలూకు కూడా చేరింది. ఈ విషయాన్ని లాలూ ప్రస్తావిస్తూ తాను ఆ వీడియో చూడలేదని, అయినా తానే పెద్ద మాంత్రికుడినని వ్యాఖ్యానించారు. అయితే లాలూ-నితీష్‌ బంధం ఎలా ఉన్నా… ప్రస్తుతం ఈ విషయం తెలిసి ఎన్డీయే కూటమి విపరీతంగా సంతోషపడిపోతోంది. లాలూ మీద బాబా వ్యాఖ్యలు తమ పార్టీకి కొండంత బలం చేకూర్చాయని బీజేపీ నేతలు సంబరపడుతున్నారు. ఇదే విషయాన్ని తమ ప్రచారంలో బాగా ఉపయోగించుకుంటున్నారట!

First Published:  24 Oct 2015 12:23 PM GMT
Next Story