Telugu Global
Others

అమరావతిలో అవమానం

మిత్రపక్షం కదాని ధీమాగా వెళ్లిన బీజేపీ వారికి, తర్జనభర్జన పడి శుభకార్యమంటూ వెళ్లిన కమ్యూనిస్టులకు అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో అవమానకరమైన ట్రీట్‌మెంట్ జరిగింది. బీజేపీ కార్యాలయం ఇచ్చిన పాసులు తీసుకొని సభ వద్దకు వెళ్లిన వారికి పోలీసుల నుంచి చుక్కెదురైంది. బీజేపీ కార్యాలయమం ఇచ్చిన పాసులు చెల్లవంటూ మొహం మీద చెప్పేశారు. దీంతో కంగుతినడం కమలనాథుల వంతైంది. అసలేం జరిగిందంటే…ఈవెంట్‌కు భారీగా వీఐపీలు, వీవీఐపీలు తరలివస్తుండడంతో ఎందుకైనా మంచిదని తమకు పాసులు ముందుగానే ఇప్పించాలని కొందరు బీజేపీ […]

అమరావతిలో అవమానం
X

మిత్రపక్షం కదాని ధీమాగా వెళ్లిన బీజేపీ వారికి, తర్జనభర్జన పడి శుభకార్యమంటూ వెళ్లిన కమ్యూనిస్టులకు అమరావతి శంకుస్థాపన కార్యక్రమంలో అవమానకరమైన ట్రీట్‌మెంట్ జరిగింది. బీజేపీ కార్యాలయం ఇచ్చిన పాసులు తీసుకొని సభ వద్దకు వెళ్లిన వారికి పోలీసుల నుంచి చుక్కెదురైంది.

బీజేపీ కార్యాలయమం ఇచ్చిన పాసులు చెల్లవంటూ మొహం మీద చెప్పేశారు. దీంతో కంగుతినడం కమలనాథుల వంతైంది. అసలేం జరిగిందంటే…ఈవెంట్‌కు భారీగా వీఐపీలు, వీవీఐపీలు తరలివస్తుండడంతో ఎందుకైనా మంచిదని తమకు పాసులు ముందుగానే ఇప్పించాలని కొందరు బీజేపీ రాష్ట్రనాయకత్వంపై ఒత్తిడి చేశారు. దీంతో బీజేపీ అగ్రనేతలు ప్రభుత్వాన్ని సంప్రదించారు. కొన్ని పాసులను బీజేపీ విజయవాడ కార్యాలయానికి ప్రభుత్వం పంపింది. దీంతో తమ వారికి పాసులను పంచిపెట్టి సభకు వెళ్లండని పంపించారు. కానీ చెకింగ్ పాయింట్ దగ్గరకు వెళ్తేగానీ అసలు విషయం వారికి అర్థం కాలేదు.

పాసులపై హోలోగ్రాం లేదని కాబట్టి పాసులు చెల్లవంటూ పోలీసులు తిరస్కరించారు. అప్పటికప్పుడు ఏం చేయలేక చాలా మంది బీజేపీ చిన్నచిన్న నాయకులు వెనుదిగారు. కావాలనే హోలోగ్రాం లేని పాసులను పంపారని కొందరు బీజేపీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కమలనాథుల కథ ఇలా ఉంటే కమ్యూనిస్టులది కనీసం బయటకు కూడా చెప్పుకోలేని పరిస్థితి.

వైసీపీ, కాంగ్రెస్‌లు కార్యక్రమాన్ని బహిష్కరించినప్పటికీ తాము వచ్చినందుకు ప్రభుత్వ వర్గాలు ఎదురొచ్చి స్వాగతం పలుకుతాయని కమ్యూనిస్టులు అంచనా వేసుకుని వెళ్లారు. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత వారిని పట్టించుకున్న వారే లేరు. కనీసం వారు వచ్చినట్టు వేదికపైన కూడా ప్రకటించలేదు. సీపీఐ అగ్రనాయకుడు నారాయణకూ అదే అనుభవం ఎదురైంది. దీంతో నారాయణ, రామకృష్ణ, సీపీఎం మధు సభ సగంలో ఉండగానే అక్కడి నుంచి జంప్ అయ్యారు.

First Published:  23 Oct 2015 11:53 PM GMT
Next Story