Telugu Global
CRIME

మొబైల్‌ ఫోన్స్‌ వల్లే అత్యాచారాలు!

‘మొబైల్‌ ఫోన్‌లొచ్చి అందరినీ పాడు చేస్తున్నాయి. సమాజంలో అరాచకాలకు కారణమవుతున్నాయి. అత్యాచారాలకు ఊతమిస్తున్నాయి’… ఈ మాటలన్నది ఎవరో కాదు సమాజ్‌వాది పార్టీనాయకుడు అజమ్‌ఖాన్‌. గతవారం ఢిల్లీలో రెండున్నరేళ్ళ పాపపై జరిగిన అత్యాచారాన్ని ప్రస్తావిస్తూ మొబైల్‌ ఫోన్‌లు చిన్నాపెద్దా… ఇలా అందరికీ అందుబాటులోకి రావడం వల్ల… వాటిలో అశ్లీల దృశ్యాలను డౌన్‌లోడ్‌ చేసుకుని చూడడం వల్ల ఇలాంటి సంఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని ఆయన అన్నారు. గ్రామాల్లో కూడా ఈరోజు అందరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌లు ఉంటున్నాయని, వీటిలో వచ్చే దృశ్యాలు […]

మొబైల్‌ ఫోన్స్‌ వల్లే అత్యాచారాలు!
X

‘మొబైల్‌ ఫోన్‌లొచ్చి అందరినీ పాడు చేస్తున్నాయి. సమాజంలో అరాచకాలకు కారణమవుతున్నాయి. అత్యాచారాలకు ఊతమిస్తున్నాయి’… ఈ మాటలన్నది ఎవరో కాదు సమాజ్‌వాది పార్టీనాయకుడు అజమ్‌ఖాన్‌. గతవారం ఢిల్లీలో రెండున్నరేళ్ళ పాపపై జరిగిన అత్యాచారాన్ని ప్రస్తావిస్తూ మొబైల్‌ ఫోన్‌లు చిన్నాపెద్దా… ఇలా అందరికీ అందుబాటులోకి రావడం వల్ల… వాటిలో అశ్లీల దృశ్యాలను డౌన్‌లోడ్‌ చేసుకుని చూడడం వల్ల ఇలాంటి సంఘటనలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని ఆయన అన్నారు. గ్రామాల్లో కూడా ఈరోజు అందరి చేతిలో స్మార్ట్‌ఫోన్‌లు ఉంటున్నాయని, వీటిలో వచ్చే దృశ్యాలు ప్రేరణకు గురి చేస్తున్నాయని, యువతను, చిన్న పిల్లల్ని చెడగొడుతున్నాయని ఖాన్‌ చెప్పారు. అత్యాచారాలు సమాజాన్ని నాశనం చేస్తున్నాయని అన్నారు. ఇదే విషయాన్ని జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఓమర్‌ అబ్దుల్లా వద్ద ప్రస్తావించగా ‘అవును ఆయన చెప్పింది నిజమే. స్మార్ట్‌ఫోన్‌లు లేనప్పుడు అత్యాచారాలు, అక్రమాలు ఇంత పెద్ద ఎత్తున జరగలేదు’ అని అన్నారు.

First Published:  23 Oct 2015 4:01 PM GMT
Next Story