Telugu Global
Cinema & Entertainment

 చిరంజీవి విజేత‌కు 30 ఏళ్లు

‘విజేత’ చిత్రం 1985 అక్లోబర్ 23న దసరా కానుకగా విడుదలయింది… ఈ సినిమా ఆ యేడాది చిరంజీవి నటించిన చివరి చిత్రం కావడం విశేషం… ఈ చిత్రాని కంటే ముందు వచ్చిన ‘అడవిదొంగ’ ఆ యేడాది చిరంజీవి సినిమాల్లో పెద్ద హిట్ గా నిలచింది… ఆ ఊపులో జనం ‘విజేత’ను కూడా విశేషంగా అలరించారు… అప్పటి దాకా యాక్షన్ హీరోగా సాగిన చిరంజీవిని, ఇందులో ఫ్యామిలీ హీరోగా చూపించడంలో దర్శకుడు కోదండరామిరెడ్డి సఫలీకృతుడయ్యారు… అల్లు అరవింద్ కు […]

 చిరంజీవి విజేత‌కు 30 ఏళ్లు
X

‘విజేత’ చిత్రం 1985 అక్లోబర్ 23న దసరా కానుకగా విడుదలయింది… ఈ సినిమా ఆ యేడాది చిరంజీవి నటించిన చివరి చిత్రం కావడం విశేషం… ఈ చిత్రాని కంటే ముందు వచ్చిన ‘అడవిదొంగ’ ఆ యేడాది చిరంజీవి సినిమాల్లో పెద్ద హిట్ గా నిలచింది… ఆ ఊపులో జనం ‘విజేత’ను కూడా విశేషంగా అలరించారు… అప్పటి దాకా యాక్షన్ హీరోగా సాగిన చిరంజీవిని, ఇందులో ఫ్యామిలీ హీరోగా చూపించడంలో దర్శకుడు కోదండరామిరెడ్డి సఫలీకృతుడయ్యారు… అల్లు అరవింద్ కు నిర్మాతగా ఈ చిత్రం మంచి లాభాలనే సంపాదించి పెట్టింది… చిరంజీవికి ‘విజేత’ చిత్రం ఉత్తమనటుడిగా ఫిలిమ్ ఫేర్ అవార్డును కూడా సంపాదించి పెట్టింది… మంచి కథ, కథనం ఉంటే జనం ఇమేజ్ ను పట్టించుకోకుండా ఆదరిస్తారని ‘విజేత’ నిరూపించింది… ఈ సినిమా విజయం అందించిన స్ఫూర్తితో చిరంజీవి ఆ తరువాత పలు వైవిద్యమైన పాత్రలు ధరించారు… చిరంజీవి నటజీవితంలో ‘విజేత’ ఓ ఆణిముత్యంగా నిలచింది…
‘విజేత’ కథ విషయానికి వస్తే- జె.వి.సోమయాజులుకు ముగ్గురు కొడుకులు, ఓ కూతురు.. అన్నలు పనిచేస్తున్నా చిన్నవాడయిన చిరంజీవి ఏలాంటి బాధ్యతలు లేకుండా ఫుట్ బాల్ ఆటతో కాలక్షేపం చేస్తుంటాడు… అది తండ్రికి వేదన కలిగిస్తూ ఉంటుంది… కూతురు పెళ్ళి కోసం తన కిడ్నీ అమ్మాలనుకుంటాడు సోమయాజులు… ఈ విషయం చిరంజీవికి తెలిసి తానే తన కిడ్నీని అమ్మి, సత్యనారాయణ కొడుకు ప్రాణం నిలబెడతాడు.. సత్యనారాయణ కంపెనీలోనే అతనికి మేనేజర్ గా పని వస్తుంది… చినబాబు గొప్పతనం తెలుసుకొని తండ్రి మనసు, తోబుట్టువులు సంతసించడంతో కథ ముగుస్తుంది…
చిరంజీవి, భానుప్రియ జంటగా నటించిన ‘విజేత’లో శారద, జె.వి.సోమయాజులు, అల్లు రామలింగయ్య, గిరిబాబు, రంగనాథ్, నూతన్ ప్రసాద్, కె.విజయ, శుభ, శ్రీలక్ష్మి, సంయుక్త ముఖ్యపాత్రధారులు… ఈ చిత్రానికి జంధ్యాల మాటలు రాశారు… వేటూరి పాటలు, చక్రవర్తి సంగీతం కలసి జనాన్ని అలరించాయి…మెగాస్టార్ ను ఫ్యామిలీ ఆడియ‌న్స్ కు బాగా చేరువ చేసిన చిత్రాల్లో విజేత ఒక‌టి.

First Published:  23 Oct 2015 7:06 PM GMT
Next Story