కంచె చుట్టూ మరిన్ని సన్నివేశాలు

చూస్తుంటే.. ఊహించని విజయాన్ని అందుకునేట్టు ఉన్నాడు వరుణ్ తేజ. కంచె సినిమాకు రోజురోజుకు రెస్పాన్స్ పెరుగుతోంది. క్రిష్ సినిమా కాబట్టి జనాల్లోకి నెమ్మదిగా ఎక్కుతోంది కంచె. పైగా బ్రూస్ లీ ఫ్లాప్ టాక్, రుద్రమదేవి హవా అయిపోవడంతో అంతా కంచె కోసం ఎగబడుతున్నట్టు కనిపిస్తోంది. దీంతో కంచె టీం ఇప్పుడు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేసింది. మరింతమంది ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేసేందుకు అదనంగా ఇంకొన్ని సన్నివేశాల్ని కూడా జతచేయాలని భావిస్తున్నారు. సినిమాలో యుద్ధ సన్నివేశాలకు మంచి స్పందన వస్తోంది. దీంతోపాటు హీరోహీరోయిన్ల మధ్య ప్రేమ సన్నివేశాల్ని కూడా ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎడిటింగ్ లో కట్ చేసిన అలాంటి కొన్ని సీన్లను ఇప్పుడు యాడ్ చేయాలని భావిస్తోంది కంచె టీం. మెగా కాంపౌండ్ నుంచి క్లియరెన్స్ రాగానే కంచెకు అదనంగా కొన్ని సీన్లు యాడ్ అవుతాయి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్ తేజ, ప్రగ్యా జైస్వాల్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఓ మంచి సందేశంతో తెరకెక్కింది కంచె మూవీ.